ETV Bharat / state

'రైతు భరోసా'పై క్లారిటీ వచ్చేసింది! - అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడేది ఎప్పుడంటే? - RYTHU BHAROSA SCHEME UPDATE

వచ్చే యాసంగి నుంచి రైతు భరోసా అమలు - ఎకరాకు రూ.7,500 చొప్పున ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడి

Rythu Bharosa Scheme Update
Rythu Bharosa Scheme Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2024, 1:10 PM IST

Rythu Bharosa Scheme Update : రాష్ట్ర మంత్రివర్గ సబ్​ కమిటీ రిపోర్ట్​ ఇచ్చాకే, వచ్చే యాసంగి సీజన్‌ నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని, ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రూ.2 లక్షల వరకు రుణాలుండి, నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి, డిసెంబర్​లోగా వారి అకౌంట్​లలో నిధులు జమ చేస్తామన్నారు. రూ.2 లక్షలకుపైగా రుణాలున్న వారి కోసం షెడ్యూల్ ప్రకటించి, అర్హత గల వారికి అమలు చేస్తామని తెలిపారు. వచ్చే సీజన్‌ నుంచి పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఆఫీసులో ఛైర్మన్‌ కోదండరెడ్డితో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

"అర్హులైన ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందించడమే రాష్ట్ర సర్కార్ లక్ష్యం. దీనికి అనుగుణంగా కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రూపొందిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు కింద కొండలు, గుట్టలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, సాగులో లేని భూములకు సైతం దాదాపు రూ.25 వేల కోట్లు వెచ్చించారు. మా ప్రభుత్వ హయాంలో కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఫండ్స్ జమ చేస్తాం. విధివిధానాలు ఫైనల్ కాగానే, రాబోయే పంట సీజన్‌ నుంచి రైతుల ఖాతాల్లో పంట సాయం వేస్తాం. పంట వేసిన వారికే నిధులు అందిస్తాం. 42 బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు 25 లక్షల కుటుంబాల్లోని 42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీకి అవసరమైన నిధులు రూ.31 వేల కోట్లు." అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామన్న మంత్రి తుమ్మల, ఇంకా 20 లక్షల మందికి అమలు కావాలన్నారు. తెల్ల రేషన్‌కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబరులో కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు అదనపు డబ్బులు కడితేనే మాఫీ చేస్తామని, దీనికి షెడ్యూల్ ఖరారు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పంటల బీమాను వచ్చే యాసంగి నుంచి అమలు చేస్తామని తెలిపారు. రైతుల తరఫున సర్కారే ప్రీమియం చెల్లిస్తుందని, గత నెలలో వచ్చిన వరద నష్టాలపై ప్రైమరీ రిపోర్ట్ అందిన అనంతరం వాస్తవ నష్టాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసిన తర్వాతే ఆ మేరకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించినట్లు గుర్తు చేశారు.

అన్ని పంటలను మద్దతు ధరలతో కొంటాం : రాష్ట్రంలో పండే అన్ని పంటలను కనీస మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ఆయన, రాష్ట్రం కొనుగోలు చేసిన పంటల్లో కేంద్రం 25 శాతమే తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. సన్నధాన్యం విక్రయించిన రైతులందరికీ క్వింటాల్​కు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లిస్తామని తుమ్మల తెలిపారు. సమావేశంలో విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేశ్‌రెడ్డి, రైతు సంఘాల నేతలు సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ, నల్లమల వెంకటేశ్వరరావు, పద్మారెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల సూచనలు, అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రైతు భరోసా : మంత్రివర్గ ఉపసంఘం - Rythu Bharosa Workshop in telangana

రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఏడాదికి రూ.15 వేలు : మంత్రి తుమ్మల - Minister Tummala on Rythu Bharosa

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.