Miyapur Minor Girl Murder Update : హైదరాబాద్ మియాపూర్‌లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు బాలిక పన్నేండేళ్ల మర్డర్ కేసులో ఆమె తండ్రే ప్రధాన సూత్రధారిగా నిర్థారించారు. కంటికి కనుపాపలా కాపాడాల్సిన కన్న తండ్రే కడతేర్చాడని పోలీసులు తేల్చారు.
కామవాంఛతో కన్నతండ్రే కాలయముడై కడతేర్చిన వైనం : పోర్న్ వీడియోలు చూడడం, మద్యపానానికి బానిసైన తండ్రి, కుమార్తెను కోరిక తీర్చాలని వేధించాడు. ఆ చిన్నారి నిరాకరించడంతో కోపంతో హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సీసీటీవీలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని మియాపూర్ ఏసీపీ నరసింహారావు వివరించారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన నిందితుడు భార్య, కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం మియాపూర్ ఠాణా పరిధిలోని నడిగడ్డ తండాకు వలసవచ్చారు. ఇక్కడకు వచ్చిన 15 రోజుల్లోనే నిందితుడు పోర్న్ వీడియోలు, మద్యానికి బానిసగా మారి కన్నబిడ్డపై కన్నేశాడు. కామవాంఛతో కర్కశంగా ప్రవర్తించేవాడు.
Miyapur ACP On Girl Murder Case : ఈ క్రమంలోనే తన కోరిక తీర్చాలంటూ బాలికపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. దీంతో ఆ బాలిక అమ్మకు చెప్తానని గట్టిగా అరవడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. కోపంతో నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి జుట్టుపట్టి నేలకొసి కొట్టాడని అనంతరం బండరాయితో మోది హత్య చేశాడని ఏసీపీ వివరించారు.
అక్కడి నుంచి బయటకు వచ్చిన నిందితుడు బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి నిర్ధారించుకున్నాడని ఏసీపీ పేర్కొన్నారు. ఇలా వరుసగా మూడు రోజులపాటు బాలిక మృతదేహాన్ని చూడడానికి ఘటనాస్థలానికి వెళ్లాడన్నారు. కానీ హత్య చేసిన రోజే తన కూతురు కనిపించడం లేదని నిందితుడు భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో తండ్రి బాలిక మృతదేహం లభ్యమైన ప్రదేశానికి వెళ్లడం సీసీటీవీలో గమనించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. వారం రోజుల పాటు అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టాడని ఏసీపీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. కామం మత్తులో కన్న కుమార్తెపైనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన నీచుడ్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
Minister Sitakka on Minor Girl Death : రెండురోజులు క్రితం మియాపూర్‌లో మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై ఆరా తీసిన మంత్రి సీతక్క, నిందితులను ఎవ్వరిని వదలబోమని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈక్రమంలోనే మైనర్ బాలిక కుటుంబ సభ్యులను, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట శివారు లక్ష్మా తండాలో ఆమె పరామర్శించారు.
బాలిక కేసులో పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా, మియాపూర్ పోలీసులతో సీతక్క మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కానీ ఇంటి నీచుడే ఈ పాపానికి ఒడిగట్టాడనే విషయం గ్రహించలేకపోయారు. ఎట్టకేలకు పోలీసుల ముమ్మర దర్యాప్తులో కామాంధుడు నిజస్వరూపం వెల్లడైంది.
అత్యాచార నిందితులను ఎవ్వరిని వదిలిపెట్టం- మంత్రి సీతక్క
నడిరోడ్డుపై యువతిని కొట్టి చంపిన ప్రియుడు- పోలీసులు వచ్చే వరకు మృతదేహం వద్దే!