Phone Tapping Case Update : పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటివరకు ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేయగా, వీరితో పాటు ట్యాపింగ్ వ్యవహరంలో ఎవరెవరూ పాల్గొన్నారు అనే అంశాలపై దృష్టిసారించారు. ఐ న్యూస్ యజమాని శ్రవణ్ రావు ఇంట్లో సోదాల సమయంలో దొరికిన ఓ పెన్‌డ్రైవ్‌లో పోలీసులకు కీలక ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం.
ట్యాపింగ్ ప్రకంపనలు - నేతల పరస్పర ఆరోపణలు - telangana phone tapping case
ఓ మాజీ మంత్రి తరచూ ఆయన ఇంటికి వచ్చి వెళ్తుండే వారని స్థానికులు పోలీసులకు వివరించారు. అరెస్టయిన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కస్టడీ విచారణ తర్వాత కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారు. ఆ సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అరెస్టయిన అధికారుల ఆస్తులు, ఆదాయాలపై దృష్టిసారించింది. ముఖ్యంగా ప్రణీత్‌రావుకు(Praneeth Rao) మూసాపేటలోని నివాసంతో పాటు నగరంలో మరోచోట రూ.కోట్ల విలువైన విలాసవంతమైన గృహం ఉన్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Telangana Phone Tapping Case : ట్యాపింగ్ కోసం వినియోగించిన సామగ్రిని విదేశాల నుంచి కొనుగోలు చేశారని తేలడంతో, ఇందుకు సహకరించిన వారిపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ పరికరాలను ఎక్కడ పెట్టారు? ఇతర ప్రైవేటు ప్రదేశాల్లో ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ట్యాపింగ్ చేయాలని ఆదేశించిన రాజకీయ పెద్దలకు సైతం నోటీసులు ఇచ్చి విచారించేందుకు న్యాయ సలహా కోరుతున్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రణీత్‌రావు, బృందంలో కీలకంగా ఉండి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్‌కాల్స్ ట్యాపింగ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలను ఒక యూనిట్‌గా చేసి ఈ రెండు జిల్లాల వార్‌రూమ్‌ను నల్గొండలోని ఓ భవనంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో నల్గొండ జిల్లాలో పనిచేసి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఇంఛార్జ్‌గా వ్యవహరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న ప్రజాప్రతినిధితో పాటు సదరు ప్రజాప్రతినిధికి అండగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల ఫోన్ కాల్స్ లక్ష్యంగా ఈ వార్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అమెరికాకు చెందిన నలుగురు సాఫ్ట్‌వేర్ టెకీలు నల్గొండ వార్‌రూంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు తెలిసింది.
ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు? బెదిరించిన రియల్టర్లు, వ్యాపారులు ఎవరు, వారి నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూళ్లు చేశారనే దానిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లోనూ పలువురు నేతలు, వ్యాపారుల ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడగా బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వాటి ఆధారంగా కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నల్గొండ, దేవరకొండకు చెందిన ఇద్దరు వ్యాపారులు హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేసి బాగా ఆర్జించారు. వారి ఫోన్లను ట్యాప్ చేసి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్‌కు మూలకారకులు కేసీఆర్, కేటీఆర్ : ఎంపీ లక్ష్మణ్ - MP Laxman On Phone Tapping