TGSRTC Good News For Vijayawada Passengers : పటాన్చెరు - బీహెచ్ఎల్ - రామచంద్రాపురం నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బీహెచ్ఎల్ డిపో నుంచి కొత్తగా ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ వెళ్లేందుకు నూతనంగా రెండు ఈ-గరుడ బస్సులను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఈ-గరుడ ప్రారంభిస్తున్నామన్నారు.
ఈ బస్సులు రామచంద్రాపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియన్ టౌన్షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడ వెళ్తాయన్నారు. తద్వారా విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ప్రతిరోజూ రాత్రి 9:30, 10:30కు రామచంద్రాపురం నుంచి బస్సులు బయలుదేరుతాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత విజ్ఞప్తి చేశారు.
Festival Special Trains To Tirupati : అక్టోబర్ మాసమంతా పండుగలే. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేరకు నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు అంతా ఊరుబాట పడతారు. దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబరు 1వ తేదీ నుంచి నవంబరు 16 తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
కాచిగూడ-సికింద్రాబాద్ (07063) 7 సర్వీసులు, తిరుపతి టూ కాచిగూడ (07064) మరో 7 సర్వీసులు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి (07041) 14 సర్వీసులు, తిరుపతి - సికింద్రాబాద్ (07042) 14 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని జోన్ సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి రైళ్లు జనగామ, వరంగల్ మార్గంలో కాచిగూడ-తిరుపతి రైళ్లు ఉందానగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల మార్గంలో హాల్ట్‌లు ఉంటూ రాకపోకలు సాగించనున్నట్లు వివరించారు.
దసరా కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు : మరోవైపు దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ సిద్ధమవుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్సు సర్వీసులు నడిపేందుకు సంస్థ స్పెషల్ ప్లాన్ సిద్ధం చేసింది. విజయవాడలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి 12 వరకు (అక్టోబర్ 3 -12) జరగనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇదే సమయంలో పాఠశాలలకు, కాలేజీలకు పండగ సెలవులు ఉన్నందున తమ ఊళ్లోకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. దీంతో ఫెస్టివల్స్‌కు ఉండే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 3 నుంచి 15 వరకు 13 రోజులపాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తెలియజేశారు.
సంక్రాంతికి ఊరెళ్లాలా? - అయ్యో!! టికెట్లు లేవండి బాబు - SANKRANTI TRAIN TICKETS ISSUE