ETV Bharat / state

గతంతో పోల్చుకుంటే వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా : దక్షిణ డిస్కం - TGSPDCL Power Monitoring - TGSPDCL POWER MONITORING

Better Power Supply to Consumers in Telangana : విద్యుత్‌ అంతరాయాలు, అంతరాయం సమయాల్లో గణనీయమైన క్షీణతను నమోదు చేసిందని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ తెలిపారు. గతంలో కంటే మెరుగైన విద్యుత్‌ సరఫరాను అందిస్తున్నామని అన్నారు.

Better Power Supply to Consumers in Telangana
Better Power Supply to Consumers in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 5:18 PM IST

TGSPDCL Power Monitoring : గతంతో పోల్చుకుంటే టీజీఎస్పీడీసీఎల్‌ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ వెల్లడించింది. విద్యుత్‌ అంతరాయాలు, అంతరాయం సమయాల్లో గణనీయమైన క్షీణతను నమోదు చేసిందని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. గతేడాది జనవరి నుంచి మే నెల వరకు ఉన్న అంతరాయాలు ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు ఉన్న అంతరాయాలతో పోల్చుకుంటే 33 కేవీ ఫీడర్‌ స్థాయిలో 43.5 శాతం క్షీణతను నమోదు చేశాయని సంస్థ వెల్లడించింది.

నెలలో సరాసరిగా ఒక 33 కేవీ ఫీడర్‌ పరిధిలో గతంలో 47.3 నిమిషాల అంతరాయం ఉండగా ప్రస్తుతం 26.7 నిమిషాలుగా ఉన్నది అని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ పేర్కొన్నారు. అదేవిధంగా ఒక 11 కేవీ ఫీడర్‌ పరిధిలో గతంలో 17.16 నిమిషాల అంతరాయం ఉండగా, ప్రస్తుతం 13.31 నిమిషాలుగా ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక 1.80 కోట్ల వినియోగదారులుండగా, వాటిలో ఒక 1.14 కోట్ల వినియోగదారులకు, అంటే దాదాపు 63.33 శాతం వినియోగదారులకు దక్షిణ డిస్కం ద్వారా విద్యుత్‌ సరఫరా అందజేస్తున్నామన్నారు.

అందుకే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం : ప్రస్తుతం దక్షిణ డిస్కంలో 11 కేవీ ఫీడర్లు 8,546 వరకు, 33 కేవీ ఫీడర్లు 1,422 వరకు ఉన్నాయి. వీటితో పాటు 2.48 లక్షల కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు, 1.17 లక్షల కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 16,000 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు ఉన్నాయి. భారీవర్షాలు, గాలులు ఏర్పడినప్పుడు చెట్లు, వాటి కొమ్మలు విద్యుత్‌ స్తంభాలపై కూలడం వలన, ఎల్‌టీ లైన్లపై చెట్ల కొమ్మలు పడటం, బ్యానెర్లు, ఫ్లెక్సీ వంటి ఇతర వస్తువులు లైన్లపై పడటం వల్ల కొన్ని సందర్భాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.

Power Supply in Telangana : ప్రతి ఏడాది నిర్వహించే నిర్వహణ, మరమ్మతు పనులను సమర్థవంతంగా నిర్వహించడం, తరచుగా అంతరాయాలు రికార్డు అవుతున్న ఫీడర్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం వలన ఈ అంతరాయాలను తగ్గిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ వెల్లడించారు. దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ, విద్యుత్‌ అంతరాయాలు, ట్రిప్పింగ్‌లు ఏర్పడటానికి గల మూలకారణాలపై ఒక అధ్యయనాన్ని చేపట్టిందన్నారు. దాని ఆధారంగా 33 కేవీ, 11 కేవీ స్థంబాల ఛానెల్‌, ఆర్మ్‌లో వినియోగించే మెటల్‌లో చేయాల్సిన మార్పులు, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏబీ స్విచ్‌ల వద్ద తరచూ జంపర్‌ కట్‌ వలన అంతరాయాలు కలగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌జీప్యూజ్‌, డీటీఆర్‌ స్ట్రక్చర్‌ల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం నిర్వహిస్తుందని టీజీఎస్పీడీసీఎల్‌ అధికారులు తెలిపారు.

కరెంటు తీగల్లో లోపాలను గుర్తించేందుకు థర్మల్‌ విజన్‌ కెమెరాల వినియోగం! - ఆ పరిస్థితులను నివారించేందుకే - Thermal Cameras for Electrical

కరెంట్, నీరు కష్టాలు ఎలా తీరు? - ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం చర్యలేంటి? - Power Problems in Telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.