ETV Bharat / state

రాష్ట్రంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు - వడదెబ్బతో ముగ్గురు మృతి - Temperature Rises In Telangana

Heat Wave in Telangana : భానుడి భగభగలతో రాష్ట్రంలోని పలుప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఇక్కడ 45 డిగ్రీలు ఉంది. దీంతో జనం అడుగు బయటపెట్టాలంటే జంకుతున్నారు. అలాగే రాష్ట్రంలో భానుడి సెగలకు వడదెబ్బకు గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు.

Heat Wave in Telangana
Temperature Rises In Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 12:16 PM IST

Temperature Rises In Telangana : తెలంగాణలో ఏప్రిల్​ నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. చాలా జిల్లాల్లో ఇప్పటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే భానుడి భగభగల ప్రభావం ప్రధానంగా ఔట్ డోర్ వర్కర్లపైనే ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునేవారు, నిర్మాణ రంగ కార్మికులకు ఎండ దెబ్బలు తాకే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో 45 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఇక్కడ 45 డిగ్రీలు ఉంది. ఈ జిల్లాలోని వేములపల్లి, దామరచర్ల, అనుముల హాలియా, తిరుమలగిరి(సాగర్‌), త్రిపురారం, గట్టుప్పల్‌, నిడమనూరు మండలాల్లోనూ 44 డిగ్రీల ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 43.7 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో భానుడి భగభగలు- నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు - temperatures in Telangana

Three People Died Due to Heat stroke : హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో 41.3 నుంచి 43 డిగ్రీల వరకు ఎండలున్నాయి. ఖమ్మంలో సాధారణం కన్నా 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరంలో లక్ష్మి(55) అనే మహిళ మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బకు గురై మృతి చెందారు. అలాగే సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని కోటినాయక్‌ తండాకు చెందిన దరావత్‌ గోల్యా(70), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం బాలరాజ్‌పల్లిలో నాగుల బాలయ్య(50) అనే రైతు ఎండదెబ్బతో అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో బుధ, గురువారాల్లోనూ కొన్ని జిల్లాల్లో వడగాలులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.

IMD Issues Alert on Heat waves : ఏప్రిల్​లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు జంకుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సమ్మర్​లో ఏది పడితే అది తింటున్నారా? - ఐతే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!! - Healthy Food in Summer

పెరుగుతున్న ఎండలు- అధికారులతో ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్- సమన్వయంతో పనిచేయాలని ఆదేశం - PM Modi On Heat wave Conditions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.