Telugu States Youth Involved Cyber Crimes : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పంథాలు మార్చుకుని అశ పరులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల సొమ్మును ఖాతాల నుంచి కాజేస్తున్నారు. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఈ నేరాలకు పాల్పడే వారు. ప్రస్తుతం ఆ కోవలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా చేరారు. సాధారణంగా కాల్‌సెంటర్ మోసాల్లో టెలికాలర్లుగా మాట్లాడేందుకు తెలుగు రాష్ట్రాల్లోని యువకులను సైబర్ ముఠాలు ఉపయోగించేవి. గతకొన్ని నెలలుగా నమోదవుతున్న కేసుల్లో మాత్రం ఏపీ, తెలంగాణలోని వ్యక్తులే సొంతంగా నేరాలు చేస్తూ పట్టుబడుతున్నారు. లేదా వారితో కలిసి నేరాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ మోసాల్లో నేరుగా స్థానికుల పాత్ర వెలుగుచూస్తుండడం ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు.
సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న నగరానికి చెందిన ఇద్దరు కేటుగాళ్లను ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేటకు చెందిన గుడ్డినగారి వెంకటేశ్, పాత సఫిల్‌గూడకు చెందిన మోలుగారి విజయ్ ఇద్దరూ డబ్బు సరిపోక టెలిగ్రామ్ ద్వారా సైబర్ నేరగాళ్లను సంప్రదించారు. వీరిద్దరు సమకూర్చిన బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు (Cyber Crimes) ఇప్పటివరకూ దాదాపు రూ.3 కోట్ల మేర సొత్తు కొల్లగొట్టారు.
సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు
మరో కేసులో ఆన్‌లైన్‌లో వస్తువులకు రేటింగ్ ఇస్తే కమీషన్ ఇస్తామంటూ డబ్బు కొట్టేస్తున్న వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఏపీలోని తిరుపతికి చెందిన శిరీష్‌కుమార్‌గా గుర్తించారు. చైనాలోని సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి ఇక్కడ మోసాలు చేస్తున్నాడు. నగరంలోని ఓ యువతి నుంచి రూ.60 లక్షలు కాజేశాడు.
ఎక్కడివారో ఇక్కడ ఉండి నేరాలు: ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఇతరుల బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు ఉపయోగిస్తూ సైబర్ నేరగాళ్లు డబ్బు కొల్లగొడుతుంటారు. వివరాలన్నీ నకిలీవికావడం, సాంకేతికత సాయంతో ఒక రాష్ట్రంలో ఉంటూ మరో రాష్ట్రంలో నేరం చేసినట్లు బురిడీ కొట్టించేవారు. ఈ ముఠాలకు బ్యాంకు ఖాతాలు అవసరం ఎంతో ముఖ్యం. బాధితుల్ని మోసగించాక తమ ఖాతాలకు బదులు ఇతరుల ఖాతాల్లో డబ్బు జమ చేయిస్తారు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ లేదా ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించి డబ్బు విత్‌డ్రా చేసుకుంటారు. ఇందులో భాగంగానే నేరగాళ్లు తెలుగు రాష్ట్రాలవారిని సంప్రదిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు
నేరాల కోసం సోషల్ మీడియాలో గ్రూప్‌లు: నేరగాళ్లు తమ మోసాల కోసం టెలిగ్రామ్, వాట్సాప్‌లో గ్రూపులు తయారుచేసి తాము మోసం చేయాలనుకున్న వ్యక్తుల ఫోన్ నెంబర్లను అందులో చేరుస్తుంటారు. వీరిలోనే కొందర్ని ఎంపిక చేసుకుని వ్యక్తిగతంగా చాటింగ్ చేస్తారు. నమ్మకం కుదిరితే బ్యాంకు ఖాతా తమకు ఇస్తే కమీషన్ లెక్కన చెల్లిస్తామని ఆశచూపిస్తారు. అవగాహనలేమితో డబ్బుకు ఆశపడే కొందరు బ్యాంకు ఖాతాలు, ఇతర రహస్య వివరాలు ఇస్తున్నారు. ఇటీవల సీసీఎస్ పోలీసులు నమోదు చేస్తున్న కేసుల్లో ఇలాంటి ఉదంతాలే ఎక్కువగా ఉంటున్నాయి.
Cyber attacks in Telangana : సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వ్యక్తుల్లో కొందరు వారి చేతిలో మోసపోయినవారు కూడా ఉంటున్నారు. సైబర్ నేరగాళ్లు టాస్కులు, పెట్టుబడుల పేరుతో మోసగిస్తారు. ఇందులో బాధితులు తమ పరువుపోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. సైబర్ నేరగాళ్ల ఫోన్లను సంప్రదిస్తూ డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడుతుంటారు. దీన్ని అవకాశంగా తీసుకునే నేరగాళ్లు వంచిస్తారు. బ్యాంకు ఖాతాలు సమకూర్చాలనో తాము చెప్పినట్లు చేస్తే డబ్బు తిరిగి ఇస్తామని మోసగిస్తూ అమాయకు ప్రజలను పావులుగా వాడుతున్నారు. చైనాకు చెందిన నేరగాళ్లు కూడా ఇదే తరహాలో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిలో ఎక్కువగా విద్యావంతులు ఉండడం కలవరపెడుతోంది.
రూ.1500 పెట్టుబడి పెడితే వంద రోజులపాటు సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలురూ.50 - సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పోలీసులు
98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్