ETV Bharat / state

రుణమాఫీ కానివారు ఆ పని చేయాలన్న సీఎం రేవంత్ - అదేంటో మీకు తెలుసా? - Cm Revanth on Runa Mafi - CM REVANTH ON RUNA MAFI

రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే, రుణమాఫీ కాని వారికి, 2 లక్షలు పైన రుణాలున్నవారికి సీఎం రేవంత్​రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు.

Rhythu Runa Mafi Latest Update
Rhythu Runa Mafi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 1:08 PM IST

Updated : Oct 7, 2024, 3:17 PM IST

Telangna Rhythu Runa Mafi Latest Update : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ జులై 18న రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో రూ.లక్ష వరకు పంట రుణమాఫీ జరిగింది. ఆ తర్వాత రెండో విడతలో జూలై 30న రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. ఇక ఆగస్టు 15న మూడో విడతలో భాగంగా రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కొంతమందికి రుణమాఫీకి అన్ని అర్హతలూ ఉండి కూడా అకౌంట్లలో డబ్బులు పడటం లేదు. అలాగే చాలా మంది రైతులు రూ.2 లక్షల కంటే ఎక్కువ క్రాప్ లోన్ తీసుకుని ఉన్నారు. వారి పరిస్థితి ఏంటనే దానిపై ప్రస్తుతం చర్చ జరుపుతోంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణమాఫీ కానివారు, రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నవారికి సీఎం రేవంత్​రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హైదరాబాద్​ రవీంద్ర భారతిలో అక్టోబర్ 5న (శనివారం) నిర్వహించిన దివంగత నేత జి.వెంకటస్వామి 95వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణమాఫీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉండి, రూ.2 లక్షలు క్రాప్ లోన్ ఉన్నవారందరికీ రుణమాఫీ జరిగింది. రూ.2 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ జరగలేదు. అలాంటి వారందరూ రూ.2 లక్షల కంటే పైన ఉన్న అమౌంట్ బ్యాంకులలో చెల్లించండి. ఆ తర్వాత వెంటనే వారికి కూడా రుణమాఫీ చేస్తాం" అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

అలాగే రూ. 2 లక్షల లోపు క్రాప్​ లోన్ ఉండి, ఏదైనా కారణం చేత మాఫీ జరగకపోయి ఉంటే వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రైతుల సమస్యల కోసం ప్రతి కలెక్టరేట్​లో ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశామని, ఏదైనా కారణం చేత ఇంకా రుణమాఫీ కానివారు ఉంటే కలెక్టరేట్​ వెళ్లి సంబంధిత సమస్య గురించి ఫిర్యాదు చేయండని సూచించారు. అధికారులు మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారని, తగిన అర్హతలు ఉంటే మీ క్రాప్ లోన్ తప్పకుండా మాఫీ అవుతుందని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. అంతేకానీ రుణమాఫీ విషయంలో ఏదైనా సమస్య ఉంటే రోడ్డు ఎక్కకండని, కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి మీ సమస్యను సాల్వ్ చేసుకోమని ముఖ్యమంత్రి రేవంత్ రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి :

మరో 20 లక్షల మందికి త్వరలోనే రుణమాఫీ : మంత్రి తుమ్మల

రైతులకు గుడ్​న్యూస్​ - అకౌంట్లోకి "పీఎం కిసాన్​" డబ్బులు - స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి!

Last Updated : Oct 7, 2024, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.