ETV Bharat / state

ఉదయం 9 నుంచే తగ్గేదే లే అంటోన్న 'సూర్య' బ్రో - 8 జిల్లాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలను దాటేసి కొత్త రికార్డులు - Today Weather Report Telangana - TODAY WEATHER REPORT TELANGANA

Telangana Weather Report Today : తెలంగాణపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యుడి భగభగలకు జీవజాతులు మొత్తం అల్లాడిపోతున్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల, నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Highest Temperature in Telangana
Telangana Weather Report Today
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 7:44 PM IST

Telangana Weather Report Today : భానుడి ఉగ్రరూపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 8 జిల్లాల్లో 45.5కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.2 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వడగాల్పుల ప్రభావానికి జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండ వేడిమి తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. ఉదయం 9 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.

రాష్ట్రంలో ఇవాళ 45 డిగ్రీల పైగా నమోదయిన జిల్లాల వివరాలు :

జిల్లాప్రాంతంనమోదైన ఉష్ణోగ్రత
జగిత్యాల జైన46.2
నల్గొండమాడ్గులపల్లి46.2
కరీంనగర్‌కొత్తగట్టు46
సిద్ధిపేటదూల్మిట్ట45.9
మంచిర్యాలజన్నారం45.7
ములుగు జిల్లామల్లూరు45.6
జోగులాంబ గద్వాల వడ్డేపల్లి 45.6
నిర్మల్‌లింగాపూర్‌45.5
వరంగల్ఉర్సు45.4
జనగాంజనగాం పట్టణం45.3
పెద్దపల్లి మంథని45.3
జయశంకర్ భూపాలపల్లిచిట్యాల45.3
కొమరంభీం ఆసిఫాబాద్‌జంబుగ 45.3
మహబూబాబాద్​కొమ్ములవంచ45.1

Highest Temperature in Telangana : ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. గత రెండు రోజులుగా తీవ్రమైన వడగాల్పులు వీచాయి. మరో 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

దంచికొడుతున్న ఎండలు - గిర్రుమంటోన్న కరెంట్ మీటర్ - Power Consumption In Telangana

Possibility of Hailstorm in Telangana : బుధ, గురువారాల్లో నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబ్‌బాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్​నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మే 3వ తేదీన నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.

మే 4వ తేదీన ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 5వ తేదీన ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, వరంగల్‌, హనుమకొండ, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో భానుడి భగభగలు- నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు - temperatures in Telangana

Old People Effect Heavy Temperature : వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరించారు. తలపై ఎండ తగలకుండా ఉండేందుకు గొడుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లను వెంట తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ దెబ్బ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులతో పాటు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

పెరుగుతున్న ఎండలు- అధికారులతో ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్- సమన్వయంతో పనిచేయాలని ఆదేశం - PM Modi On Heat wave Conditions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.