ETV Bharat / state

రాష్ట్రంలో యూనివర్సిటీ వీసీల నియామకంపై సర్కార్ కసరత్తు - నోటిఫికేషన్‌ విడుదల

Telangana Vice Chancellors Notification 2024 : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కొత్త ఉపకులపతుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పది విశ్వవిద్యాలయాల వీసీల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వారు దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చేనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ గడువు విధించింది.

Telangana Vice Chancellors Notification 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 1:45 PM IST

Telangana Vice Chancellors Notification 2024 : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు (Universities in Telangana) కొత్త ఉపకులపతుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పది యూనివర్సిటీలకు వీసీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలుగు, మహాత్మా గాంధీ, అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం మే 22న ముగియనుంది.

కొత్త వీసీల నియామకం కోసం అర్హులు దరఖాస్తులు సమర్పించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల వరకూ బయోడేటాతో కూడిన దరఖాస్తు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హతలు, విధివిధానాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంటాయని బుర్రా వెంకటేశం వెల్లడించారు.

విశ్వవిద్యాలయాలు విశిష్ట నిలయాలుగా ఎదగాలి: గవర్నర్‌

అన్వేషణ కమిటీల ద్వారా ఎంపికలు : వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకానికి ప్రొఫెసర్లుగా 10 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. దానికితోడు నోటిఫికేషన్‌ నాటికి వయసు 65 ఏళ్లలోపు ఉండాలి. అందిన దరఖాస్తులను విద్యాశాఖ పరిశీలించి అర్హుల పేర్లను అన్వేషణ(సెర్చ్‌) కమిటీకి పంపుతుంది. ఆ కమిటీలో ముగ్గురు సభ్యులు యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ, వర్సిటీ నామినీ ఉంటారు. ఒక్కో విశ్వవిద్యాలయానికి మూడు పేర్లను సర్కార్‌కు వారు సిఫారసు చేస్తారు. వాటిని ముఖ్యమంత్రి ఆమోదంతో గవర్నర్‌కి పంపుతారు. అందులో ఒకరిని ఉపకులపతిగా నియమిస్తారు.

ఇక మిగిలేవి ఆర్జీకేయూటీ, మహిళా వర్సిటీలే : తెలంగాణ ఆవిర్భావం నుంచి బాసరలోని ఆర్జీకేయూటీకి వైస్‌ ఛాన్స్‌లర్‌ను (Vice Chancellors Notification) నియమించలేదు. మిగిలిన వాటికి గవర్నర్‌ కులపతి కాగా, బాసర ట్రిపుల్ ఐటీకి రాష్ట్ర ఆవిర్భావం దాకా అమెరికాలోని కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఆచార్యుడైన రాజిరెడ్డి ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. ఆయన వైదొలిగిన తర్వాతి నుంచి కులపతి ఎవరూ లేరు. ఈ వర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించాలంటే ముందుగా ఛాన్స్‌లర్‌ను నియమించడం తప్పనిసరి.

ఆన్‌లైన్‌ కోర్సులకు వర్చువల్​ విశ్వవిద్యాలయాలు!

TS Vice Chancellors Notification : ప్రత్యేకంగా ఛాన్స్‌లర్‌ను నియమిస్తారా? అన్ని వర్సిటీల మాదిరిగా గవర్నర్‌ను కులపతిగా చేస్తారా? అన్న అంశంపై స్పష్టత వస్తేనే పూర్తిస్థాయి వీసీని నియమించడానికి వీలవుతుంది. ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొ.వి.వెంకటరమణ 2022 మే నెల నుంచి ఇంఛార్జ్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక కోఠి మహిళా కళాశాలలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరిస్తూ రెండేళ్ల క్రితం గత సర్కర్ నిర్ణయించింది. ఇంఛార్జ్‌ వీసీగా ప్రొ.విజ్జులతను నియమించింది. అయితే వర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టలేదు. ఆ ప్రక్రియ పూర్తయితేనే శాశ్వత వీసీని నియమించేందుకు అవకాశం ఉంది.

Telangana Govt Invites Applications for Child Rights Commission : మరోవైపు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఛైర్ పర్సన్, ఆరుగురు సభ్యుల నియామకం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తులను http://wdcw.tg.nic.in ద్వారానే సమర్పించాలని, ఇంటర్వూల ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే

ఆంధ్రాలో ఆ యూనివర్సిటీ ఫేక్​, జాబితాలో మరో 21 విశ్వవిద్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.