ETV Bharat / state

రైతులకు గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే రైతుభరోసా స్కీమ్ అమలు - వారికి మాత్రమే రూ.15000..! - Rythu Bharosa Scheme Update - RYTHU BHAROSA SCHEME UPDATE

Telangana Rythu Bharosa Update : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రకటించిన రైతు భరోసా స్కీమ్ అమలుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. అంతా సజావుగా సాగితే హామీ ఇచ్చినట్టుగా రైతులకు త్వరలోనే రూ.15,000 అందించనున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Rythu Bharosa Update
Rythu Bharosa
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 2:07 PM IST

Telangana Rythu Bharosa Big Update : శాసన సభ ఎన్నికల ముందు ప్రజలకు వాగ్ధానం చేసిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్.. మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షలకు పెంపు, రూ.500లకే వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు(Free Current) వంటి గ్యారంటీలను ప్రారంభించింది.

ఈ క్రమంలోనే మిగిలిన వాటిని కూడా త్వరితగతిన అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. అయితే.. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో.. కొత్త పథకాల అమలు కుదరట్లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే మిగిలన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని అంటున్నారు. ఇందులో ముఖ్యంగా రైతుభరోసా, పంటలబీమా, రుణమాఫీ పథకాల విధివిధానాలపై విస్తృత కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

ముఖ్యంగా.. వచ్చే వానాకాలం సీజన్​లోనే 'రైతు భరోసా' పథకాన్ని ప్రారంభించే దిశగా సర్కార్ చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే 'రైతు భరోసా' పథకాన్ని అమలు చేసి రైతులకు ఆర్థిక సహాయం అందిచాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. లోక్​సభ ఎన్నికల కోడ్ ముగియగానే అంటే.. జూన్ మొదటివారం తర్వాత రైతు భరోసా డబ్బుల పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం రోడ్డెక్కుతున్నారా? - అవస్థలు ఖాయం! - adjustment of buses in hyderabad

అయితే.. ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబంధు స్కీమ్​లో కొన్ని కీలక మార్పులు చేసి.. 'రైతు భరోసా' పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా భూస్వాములు, ఐటీ పన్ను కట్టే ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ భూములకు కాకుండా.. కేవలం సాగులో ఉన్న వ్యవసాయ భూమికే రైతుభరోసా పథకం అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా 5 ఎకరాల లోపున్న రైతులకే ఈ పథకం అందేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

ఇకపోతే.. శాసన సభ ఎన్నికల ముందు నిలిచిపోయిన రైతు బంధు డబ్బులను ఈ మధ్యనే అన్నదాతల అకౌంట్లలో వేశారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు డబ్బు ఎంత ఇచ్చేవారో.. అంతే డబ్బును రైతులకు అందించారు. ఇక, జూన్​ నుంచి కాంగ్రెస్ రైతు భరోసా స్కీమ్​ను అఫీషియల్​గా ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ పథకం కింద రైతులకు ఏటా ఎకరాకు మొత్తం రూ.15వేలు ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే.. ఈ డబ్బు మొత్తం ఒకేసారి ఇస్తారా? లేదంటే.. వానకాలం, యాసంగి రెండు విడతల్లో రూ.7,500 చొప్పున ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా.. రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే.. రైతుబంధు అందుకుంటున్న రైతులకు ఆటోమేటిక్​గా డబ్బులు అందించనున్నట్లు తెలుస్తోంది.

వానాకాలంలో వరి పంటవైపే అన్నదాతల మొగ్గు - 65 లక్షల ఎకరాల్లో సాగు అంచనా!

మామిడి చెట్టు కొమ్మకు ఒకే చోట 55 కాయలు, ఎక్కడంటే? - 55 Mangoes In a Single Branch

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.