ETV Bharat / state

'భారత్​ రైస్​' రేషన్​ దుకాణాల ద్వారా పంపిణీ చేయించాలి : రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం - Government Launches Bharat Rice

Telangana ration Dealers Request For Bharat Brand Rice : కేంద్రం ప్రభుత్వం భారత్ బ్రాండ్‌ పేరిట ప్రారంభించిన నిత్యావసర వస్తువుల పంపిణీ బాధ్యత తమకు కూడా అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం కోరింది. ఇవాళ కేంద్రం ప్రారంభించిన రూ. 29కే కిలో బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్​ దుకాణాల ద్వారా పంపిణీ చేయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది.

Telangana Ration Dealers Request For Bharat Brand Rice
'భారత్​ రైస్​' రేషన్​ దుకాణాల ద్వారా పంపిణీ చేయించాలి : రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 10:36 PM IST

Telangana Ration Dealers Request For Bharat Brand Rice : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్ బ్రాండ్‌ నిత్యావసర వస్తువుల పంపిణీపై బాధ్యతలు తమకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరిట అతి తక్కువ ధరలకు వివిధ సంస్థల ద్వారా ప్రవేశపెట్టిన కిలో బియ్యం 29 రూపాయల చొప్పున వివిధ రకాల నిత్యావసర వస్తువులు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని సూచించింది. తద్వారా తమకు ఆర్థికంగా కొంత తోడ్పాటు అవుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, కార్యదర్శి నాగరాజు అన్నారు.

Central Government Launches Bharat Brand Rice : వివిధ మాధ్యమాల ద్వారా భారత్ బ్రాండ్ నిత్యావసర వస్తువులను కేంద్ర ప్రభుత్వం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అవి తమకు కూడా ఎప్పుడిస్తారంటూ రేషన్ కార్డుదారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని రేషన్ డీలర్లు తెలిపారు. ఇది దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ఈ భారత్ బ్రాండ్ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి తమ ద్వారా పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Central Government Bharat Brand Products : కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సరసమైన ధరలకు బియ్యం అందించేందుకు "భారత్ రైస్" బ్రాండ్ పేరుతో విక్రయాలు ప్రారంభించింది. దీని కింద, మంచి నాణ్యత గల సన్న బియ్యాన్ని కిలోకు రూ.29 చొప్పున 5, 10 కిలోల సంచుల్లో లభ్యమవుతోంది. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల్లో భారత్‌ రైస్‌ను విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (FCI) సరఫరా చేయనుంది. భారత్‌ రైస్‌ను ఈ-కామర్స్‌ వేదికలపైనా కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతానికి, కేంద్ర సహకార సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా భారత్ రైస్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ఇతర రిటైల్ చైన్‌లలో కూడా లభ్యమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌(E Commerce)వేదికల్లో విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా, భారత్‌ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

కేంద్రం గుడ్​న్యూస్- రూ.29కే కిలో బియ్యం- వచ్చే వారం మార్కెట్​లోకి భారత్ రైస్

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్ - ఈ కేవైసీ గడువును పెంచిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.