Telangana Phone Tapping Case Update : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐదు రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరినీ దర్యాప్తు బృందం విచారించనుంది. ఈ కేసులో వీరిద్దరు ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారనుంది.
వారి ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచారు. అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్(14 Days Remand) విధించింది. ఈ మేరకు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రాధాకిషన్‌రావు అరెస్టుపై పోలీసులు ప్రకటన : రాధాకిషన్‌రావు అరెస్టుపై పోలీసులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ట్యాపింగ్ కేసులో గురువారం టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును బంజారాహిల్స్ పీఎస్‌కు పిలిచి విచారించామని తెలిపారు. విచారణలో ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ట్యాపింగ్‌లో పాల్గొన్నట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులపై నిఘా( Political Leaders Surveillance) పెట్టినట్లు ఒప్పుకున్నారన్నారు. రాజకీయంగా పక్షపాతంతో కొన్ని చర్యలను చేపట్టినట్లు తెలిపారు.
ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న డబ్బును స్వాధీనంలో అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. కేసులో ఇతర నిందితులతో కుమ్మక్కై సాక్ష్యాలను ధ్వంసం, అదృశ్యం చేయడంలో సహకరించినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారని పోలీసులు వివరించారు. అతనిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని, రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పూర్తి వివరాలు చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు - ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్
అసలేం జరిగింది : హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ చేసి అక్కడే ఓఎస్డీగా సుధీర్ఘకాలం పని చేసిన రాధాకిషన్‌రావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయనను వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారించింది. అనంతరం ఆయనను అరెస్టు చేసింది. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారంతో రాధాకిషన్‌రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ప్రణీత్‌రావు వాంగ్మూలంతో ఇద్దరు అదనపు ఎస్పీలతో పాటు ఓఎస్డీ రాధాకిషన్ రావుతో పాటు విశ్రాంత ఐజీ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇళ్లలో కొద్దిరోజుల క్రితం సోదాలు నిర్వహించారు. వీరి ఇళ్లలో సోదాలు చేసిన అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేయగా వీరి ముగ్గురు ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు వీరు విదేశాలకు వెళ్లినట్లు భావించి లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నమ్మలేని నిజాలు - నల్గొండలో వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ బెదిరింపులు!
సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా!