Telangana Parties Focus On Lok Sabha Elections : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల బరిపై అన్ని పార్టీలు గురి పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల విజయంతో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలని హస్తం పార్టీ మోదీ ఛరిష్మాతో ఎంపీ సీట్లు గతం కంటే పెంచుకోవాలని కాషాయపార్టీ కదం తొక్కుతున్నాయి. మరోపక్క తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన గులాబీ పార్టీ మాత్రం శ్రేణుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు గౌరవప్రద స్థానాల్లో గెలవాలని ఆశపడుతోంది. రాష్ట్రంలో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్‌లో చేరారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొందరు మాజీలు బీజేపీలో చేరుతున్నారు. ఈ పరిణామాల ప్రభావం ఏ పార్టీపై ప్రబావం పడనుంది. మరి ఓటరి చూపు ఎవరి వైపు ఉంది. తెలంగాణ ఫలితాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఊపునిస్తుందా ? అని బీజేపీకి దక్షిణాదిలో పట్టు పెంచుతాయా? గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అయినా పట్టు సాధించేనా? ఆయా పార్టీల్లో కూడికలు, తీసివేతల ప్రభావం ఎంత? తెలంగాణ తాజా రాజకీయ ముఖచిత్రం ఏం చెబుతోంది? ఇదీ నేటి ప్రతిధ్వని.