ETV Bharat / state

తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం - వివాదాస్పదంగా మారిన అసదుద్దీన్‌ నినాదం - Telangana MPS Oath - TELANGANA MPS OATH

Telangana MPS Oath : కొత్త లోక్‌సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం ముగిసింది. కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, మరికొందరు ఇంగ్లీష్‌, హిందీలో చేశారు. కానీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన నినాదం లోక్‌సభలో దుమారం రేపింది.

Telangana MPS Oath
Telangana MP's Took Oath At Lok Sabha (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 4:54 PM IST

Updated : Jun 25, 2024, 7:42 PM IST

Telangana MP's Took Oath At Lok Sabha : కొత్త లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రమాణాలు ప్రతిధ్వనించాయి. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డి, బలరాం నాయక్‌, కడియం కావ్య, సురేశ్​ షెట్కార్‌ తెలుగులో ప్రమాణం చేయగా, వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రతిజ్ఞ చేశారు.

Telangana MPs Oath Taking : బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ తెలుగులో ప్రమాణం చేయగా, రఘునందన్‌ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇంగ్లీష్‌లో, గోడం నగేశ్​ హిందీలో ప్రమాణం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన జై పాలస్తీనా నినాదం ఇవ్వడంతో పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిబంధనలు పరిశీలించి అసదుద్దీన్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్‌ రాధామోహన్ సింగ్‌ స్పష్టం చేశారు.

18వ లోక్‌సభలో తెలంగాణ నుంచి ఎంపీలుగా ప్రమాణం చేసిన 17 మంది వీరే

ఎంపీ పేరుపార్టీనియోజకవర్గం
కిషన్‌ రెడ్డి బీజేపీ సికింద్రాబాద్‌
బండి సంజయ్బీజేపీ కరీంనగర్‌
ఈటల రాజేందర్‌బీజేపీ మల్కాజిగిరి
డీకే అరుణబీజేపీ మహబూబ్‌నగర్‌
రఘునందన్‌ రావుబీజేపీ మెదక్‌
ధర్మపురి అర్వింద్‌బీజేపీ నిజామాబాద్‌
కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిబీజేపీ చేవేళ్ల
గోడం నగేశ్‌బీజేపీ ఆదిలాబాద్‌
మల్లు రవికాంగ్రెస్‌నాగర్‌ కర్నూల్‌
చామల కిరణ్ కుమార్‌ రెడ్డికాంగ్రెస్‌భువనగిరి
రఘువీర్‌ రెడ్డికాంగ్రెస్‌నల్గొండ
రామసహాయం రఘురాం రెడ్డికాంగ్రెస్‌ఖమ్మం
కడియం కావ్యకాంగ్రెస్‌వరంగల్
సురేశ్‌ షెట్కార్‌కాంగ్రెస్‌జహీరాబాద్‌
వంశీ కృష్ణకాంగ్రెస్‌పెద్దపల్లి
బలరాం నాయక్‌కాంగ్రెస్‌మహబూబాబాద్‌
అసదుద్దీన్‌ ఓవైసీఎంఐఎంహైదరాబాద్‌

AP MPs Oath in Lok Sabha : రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్​ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్​ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా, చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి​ గతంలోనే బాధ్యతలు స్వీకరించారు.

'కిషన్​ రెడ్డి అనే నేను' - తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎంపీలు

18వ లోక్‌సభ తొలి సెషన్- ఎంపీలుగా ప్రమాణం చేసిన మోదీ, కేంద్రమంత్రులు - Parliament Session 2024

కొత్త ఎంపీల లైఫ్ ఛేంజ్! బంగ్లా, టోల్ ఫ్రీ ట్రావెల్ సహా ఎన్నో సౌకర్యాలు!! - New MPs Facilities

Last Updated : Jun 25, 2024, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.