Telangana HC Serious on Street Dogs Attacks in State : రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులపై వీధి కుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడని ప్రభుత్వం పట్టించుకోవడడంపై తీవ్రంగా ఖండించింది. వీధి కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించి వచ్చే వాయిదాకు కోర్టుకు రావాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
చిన్నారులపై కుక్కల దాడులు - అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు - CM REVANTH ON DOG ATTACKS IN HYD
వాదనల సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.80 లక్షల కుక్కలు ఉన్నాయని వాటిని సంరక్ష ణ కేంద్రాలను తరలించడం సాధ్యం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మరోవైపు రోడ్లపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైర విహారం ఎక్కువైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై వీధి కుక్కల నియంత్రనకు స్టెరిలైజ్ చేస్తున్నట్లు కోర్టుటు ఏజీ తెలిపారు. స్టెరిలైజ్ ద్వారా కుక్కల దాడులను ఎలా అపగలరని న్యాయస్థానం ప్రశ్నించింది. శునకాల దాడులను అరికట్టేందుకు ఆరు రాష్ట్ర స్థాయి కమిటీలను వేసినట్లు ఏజీ కోర్టుకు వివరించారు. జంతు సంరక్షణ కమిటీలతో రాష్ట్ర స్థాయి కమిటీలు సమన్వయం చేసుకుని దాడులకు పరిష్కారం చూపాలని న్యాయస్థానం సూచించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.
మంచిర్యాలలో పిచ్చి కుక్క స్వైర విహారం - ఏకంగా ఓ వ్యక్తి బొటనవేలును కొరికేసిన శునకం