Telangana High Court Said to Protect Durgam Lake : దుర్గం చెరువు దుస్థితిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా పరిశీలించి పునరుద్ధరణ, పరిరక్షణకు సంబంధించి కార్యాచరణ, ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వంతో పాటు ఇతర శాఖలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులను పిలిపించడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. దుర్గం చెరువుల్లో మురుగునీటి ప్రవాహం రసాయనాలు ఔషధ ఫ్యాక్టరీల వ్యర్థాలు, ప్లాస్టిక్ కారణంగా చెరువుల్లో కాలుష్యం తీవ్రత పెరిగి చేపలు మృతి చెంది నీటిపై తేలియాడుతున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు(TS High Court) ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టి ఈ మేరకు ఇలా స్పందించింది.
రాయదుర్గం చెరువు(Raya Durgam Lake)గా పిలిచే ఈ మంచినీటి చెరువు 160 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉందని ఆ నివేదికలో పేర్కొంది. జూబ్లీహిల్స్-మాదాపూర్ మధ్య ఉన్న కనిపించకుండా రహస్య చెరువుగా దీన్ని పిలుస్తుంటారని చెప్పారు. 10 నుంచి 13 అడుగుల లోతు ఉన్న ఈ చెరువుపై జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీలను కలుపుతూ 2022 సెప్టెంబరులో ఒక బ్రిడ్జిను ప్రారంభించారని తెలిపారు.
High Court React on Durgam Lake Issue : హైదరాబాద్ జలమండలి 5 ఎంఎల్డీ ఒక మురుగునీటి శుద్ధి కేంద్రం, సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ సాంకేతిక తో మరో 7 ఎంఎల్డీ సామర్థ్యంతో మరో ఎస్టీపీని ఏర్పాటు చేసినట్లు కమిటీ పేర్కొంది. మాదాపూర్ ప్రాంతం నుంచి 30 ఎంఎల్డీల మురుగునీరు వస్తుండగా కేవలం 12 ఎంఎల్డీలను మాత్రమే ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తూ మిగిలిన శుద్ధి చేస్తూ మిగిలిన శుద్ధి చేయని మురుగు మరో కాలువ ద్వారా మల్కం చెరువుకు చేరుతోందని పేర్కొంది. వరదనీటి(Rain Water) డ్రైన్ పైపు కూడా చెరువు ప్రవేశ మార్గం వద్ద ఉందని 5 ఎంఎల్డీల ఎస్టీపీ వద్ద మినహా నీటి నమూనాను పరీక్షిస్తే కోలిఫాం, ఇ కోలిలున్నట్లు తేలింది. ఐరన్, మాంగనీస్, నికెల్, జింక్, మెటలాయిడ్స్ వంటివి నీటిలో ఉన్నట్లు తేల్చింది.
కుక్కల దాడి ఘటన.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. వారికి నోటీసులు
మురుగునీటి మళ్లింపు నిమిత్తం చెరువు చుట్టూ జలమండలి ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ ఇంకా పూర్తికాలేదని పేర్కొంది. 100 ఎకరాలకు సంబంధించి ఎఫ్టీలను నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినా తుది నోటిఫికేషన్ జారీ చేయలేదంది. ఎఫ్టీఎల్ పరిధిలో అన్ని రకాల వసతులతో 78 బఫర్ జోన్లలో 146 నిర్మాణాలు వెలిశాయని కమిటీ పేర్కొంది. రహేజా ఐటీ పార్కు(IT Park) సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తోందని తెలిపింది.
Durgam Lake Issue : స్థల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేసిన 300 మీటర్లు మినహా మిగిలిన పెన్సింగ్ పూర్తయిందని చెప్పారు. దీంతో పాటు స్వల్పకాలిక దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన ధర్మాసనం చెరువును నిర్దిష్ట కాలపరిమితితో పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏం చర్యలు తీసుకుంటారో అది ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న పూర్తి వివరాలతో కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక్క నివేదికను సమర్పించని పక్షంలో బాధ్యులైన అధికారులను కోర్టుకు పిలిపిస్తామంటూ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
High Court Hearing On EMail Petitions : మెయిల్లో వచ్చిన ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు