ETV Bharat / state

ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలు, అప్లికేషన్​ ప్రాసెస్​ ఇదే! - Telangana High Court Civil Judge - TELANGANA HIGH COURT CIVIL JUDGE

Telangana High Court Recruitment 2024: సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ ప్రకారం మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Telangana High Court Recruitment 2024
Telangana High Court Recruitment 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 5:03 PM IST

Telangana High Court Civil Judge Notification: తెలంగాణ హైకోర్టు సివిల్​ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​, ట్రాన్స్​ఫర్​ రిక్రూట్​మెంట్​ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? జీతం ఎంత ? ముఖ్యమైన తేదీలు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం...

మొత్తం ఎన్ని ఉద్యోగాలు: తెలంగాణ హైకోర్టు రిలీజ్​ చేసిన నోటిఫికేషన్​ ప్రకారం 150 పోస్టులు ఉన్నాయి. వీటిని డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​, ట్రాన్స్​ఫర్​ రిక్రూట్​మెంట్​ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభం - ఏప్రిల్ 18, 2024.
  • దరఖాస్తులకు చివరి తేదీ - మే 17, 2024.
  • హాల్ టికెట్లు డౌన్​లోడ్​ - 08 జూన్ 2024.
  • స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) - 16 జూన్ 2024.

విద్యార్హతలు ఏంటి: నోటిఫికేషన్​ ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

ఫీజు ఎంత: ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.

వేతనం ఎంత చెల్లిస్తారు: నోటిఫికేషన్​ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైతే జీతం నెలకు 77వేల 840 నుంచి 1లక్షా 36వేల 520 రూపాయలు ఉంటుంది.

ఎంపిక విధానం: తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. జాబ్​ పొందాలంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ దశలన్నింటినీ క్లియర్ చేయాలి.

  • మొదటిది స్క్రీనింగ్​ టెస్ట్​: ఇందులో 100 మల్టిపుల్​ ఛాయిస్​ క్వశ్చన్స్​ ఉంటాయి. దీనికి సమయం 2 గంటలు. స్క్రీనింగ్ టెస్ట్ కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలను ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేశారు.
  • రెండవది మెయిన్స్​: స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధిస్తే… మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇది 1:10గా ఉంటుంది. మెయిన్స్ పరీక్షల్లో మూడు పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లాతో పాటు ట్రాన్స్​లేషన్ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్​కు 100 మార్కులు కేటాయిస్తారు. ఇంగ్లీష్​లోనే పరీక్ష ఉంటుంది.
  • చివరిది వైవా: స్క్రీనింగ్​ టెస్ట్​, మెయిన్స్​లో క్వాలిఫై అయిన వారు వైవాకు అర్హత సాధిస్తారు. ఇది 1:3గా ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

  • ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారు ముందుగా అధికారిక వెబ్​సైట్​కు లాగిన్​ అవ్వాలి. లింక్​ ఇదే.. https://tshc.gov.in/getRecruitDetails
  • తర్వాత Link for Submission of Online Application for Recruitment to the Posts of Civil Judge (Junior Division) Notified for the Year 2024 అనే ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు మీకు వేరే పేజీ ఓపెన్​ అవుతుంది.
  • తర్వాత మీరు ఇది వరకే రిజిస్ట్రేషన్​ చేసుకుంటే Already Registred? To Login ఆప్షన్​కు ఎదురుగా Click Here బటన్​పై క్లిక్​ చేసి అప్లికేషన్​ ఫిల్​ చేయాలి.
  • ఒకవేళ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలనుకుంటే New Registration ఎదురుగా ఉన్న Click Here ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అక్కడ అడిగిన వివరాలు ఎంటర్​ చేసి రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్​ పూర్తైన తర్వాత Already Registred? To Login ఆప్షన్​కు ఎదురుగా Click Here బటన్​పై క్లిక్​ చేసి అప్లికేషన్​ ఫిల్​ చేయాలి. అందులో అన్ని వివరాలు సరిగా ఎంటర్​ చేసి కావాల్సిన డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయాలి. ఎగ్జామ్​ సెంటర్లను ఎంపిక చేసుకోవాలి.
  • తర్వాత ఫీజు పేమెంట్​ చేసి అప్లికేషన్​ ఫారమ్​ను సబ్మిట్​ చేయండి.
  • ఫైనల్​గా మీ అప్లికేషన్​ను తర్వాత అవసరాల కోసం డౌన్​లోడ్​ చేసుకోండి.

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips

సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగమే మీ లక్ష్యమా? ఈ ఇంటర్వ్యూ టిప్స్ మీ కోసమే! - Software Engineering Interview Tips

ఇండియాలోని అత్యంత కఠినమైన పరీక్షలు​ ఇవే! పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? - TOP 9 Toughest exams in India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.