ETV Bharat / state

హఠాత్తు వర్షం - జిల్లాల్లో తెచ్చెను అపార నష్టం - దిక్కుతోచని స్థితిలో రైతన్నలు - Telangana Heavy Rains Damage

Telangana Heavy Rains Effect : అకాల వర్షం జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినగా, కల్లాల్లో, మార్కెట్‌లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని మిగిల్చింది.

Crop Damage Due to Sudden Rains in Telangana
Telangana Rains (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 7:12 AM IST

Updated : May 17, 2024, 7:37 AM IST

రాష్ట్రంలో భారీ వర్షం- పంటను కోల్పోయిన రైతులు (ETV Bharat)

Telangana Heavy Rains Effect : రాష్ట్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులకు పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దవగా, పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద కంబళ్ల శ్రీనివాస్ తన తల్లిదండ్రులు ఎల్లయ్య, లక్ష్మితో పాటు రేగుల శ్రీనివాస్, దేవయ్యలతో కలిసి చింతకాయలు దులుపుతున్నారు. ఇంతలో గాలి వాన రావడంతో అదే చెట్టు కింద కూర్చున్నారు. ఆ సమయంలో చెట్టుపై పిడుగుపడటంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

People Died Due to Lightning : సిరిసిల్ల జిల్లాలోనే తంగళ్లపల్లి మండలం భరత్‌నగర్‌కు చెందిన రుద్రారపు చంద్రయ్య తన పొలం వద్ద మోటారు ప్యూజులు తొలగించేందుకు వెళ్లగా పిడుగుపాటుకు గురై మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండకు చెందిన పసునూరి ప్రవీణ్ తన మామతో కలిసి ద్విచక్రవాహనంపై తలకొండపల్లి మండలం చెన్నారుకు వెళ్తుండగా వర్షం రావడంతో బస్‌షెల్టర్‌లోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే ఉన్న మాడ్గుల మండలానికి చెందిన గొని నిరంజన్ తీవ్రంగా గాయపడ్డారు.

పలు జిల్లాల్లో అకాల వర్షాలు - కల్లాల్లో తడిసిన ధాన్యం, పండ్లతోటలకు నష్టం - Heavy Rains In Few Districts

అకాల వర్షం- తడిసిన ధాన్యం : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి ప్రాంతాల్లో జోరువాన కురిసింది. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, బొమ్మలరామారం, తుర్కపల్లి, మోటకొండూర్ మండలాల్లో చెట్లు నేలకూలగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. తోటల్లో పెద్ద ఎత్తున మామిడికాయలు నేల రాలాయి.

Heavy Rain in Sangareddy : సిద్దిపేట జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. గజ్వేల్‌లో ఈదురు గాలులకు చెట్టు విరిగి 2 కార్లు ధ్వంసమయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానకు మామిడి, అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి పట్టణంలో డ్రైనేజీలు పొంగి, రోడ్లపైకి నీరు చేరింది. దుబ్బాక నియోజకవర్గంలో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది.

Effect of Heavy Rainfall in Telangana : కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలంలో గాలి దుమారానికి దాదాపుగా 60 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. లింగాపూర్ మండలం దాంపూర్, నాయక్ తండా, నగూగూడ, లొద్దిగూడ, కొలం గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ గాలులకు ఆయా గ్రామాల్లోని పైకప్పులు ఎగిరిపోగా, ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులకు తమ బతుకులు రోడ్డున పడ్డాయని, కనీసం తినేందుకు తిండి కూడా లేని పరిస్థితి నెలకొందని బాధితులు వాపోయారు.

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - ఉప్పల్​ స్టేడియంలో మ్యాచ్‌ రద్దు - Rain in Telangana

తెలంగాణ ప్రజలకు అలర్ట్​ - రాగల ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు - Telangana Weather Report Today

Last Updated : May 17, 2024, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.