ETV Bharat / state

తెలంగాణలో త్వరలో కొత్త రెవెన్యూ చట్టం - అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు! - NEW REVENUE ACT IN TELANGANA 2024 - NEW REVENUE ACT IN TELANGANA 2024

New Revenue Act in Telangana : రాష్ట్రంలో భూ సమస్యలన్నింటికి కేంద్రబిందువు ధరణి పోర్టల్​ అని గమనించిన కాంగ్రెస్​ సర్కార్​ దాని స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

Government Land Issues in Telangana
Telangana Government on Dharani Portal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 9:17 AM IST

Telangana Govt To Bring New Revenue Act : రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్​ రెడ్డి సర్కార్​ సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా రూపకల్పన చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పాసుపుస్తకాలు- భూ దస్త్రాల యాజమాన్య హక్కుల చట్టం-2020 (ఆర్వోఆర్‌) ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సమస్యలకు కేంద్రబిందువుగా మారిందన్న అభిప్రాయానికి సర్కారు వచ్చింది. ఈ నేపథ్యంలోనే భూ యజమానులందరికీ సులువుగా, అనువుగా ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది.

New Revenue Bill in Telangana : 2020 అక్టోబరు 29న గత ప్రభుత్వం ఆర్వోఆర్‌ చట్టం తీసుకొచ్చింది. దానివల్ల పెద్దఎత్తున భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్​ సర్కారు గుర్తించింది. వాటిపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన ధరణి కమిటీ తయారు చేసిన నివేదిక ఆధారంగా పలు కీలక సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దీంతో కొత్త చట్టం తీసుకురావడంపై రెవెన్యూశాఖ కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా సులువుగా సేవలు అందేందుకు వీలుగా కొత్త చట్టాన్ని తీసుకువస్తామని ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు - TG Govt Focus on Dharani Problems

Telangana Govt Land Issues : నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రెవెన్యూ చట్టాలు అమల్లో ఉండేవి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తరవాత రెవెన్యూ బోర్డు, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ విభాగాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని చట్టాలు అమల్లోకి వచ్చాయి. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం 122 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ధరణి కమిటీ సభ్యులు దేశంలో విజయవంతంగా అమలవుతున్న రాష్ట్రాలపై దృష్టి సారించారు. రెవెన్యూ కోడ్, టైట్లింగ్‌ యాక్ట్‌ తదితరాలను అధ్యయనం చేస్తున్నారు. సమగ్ర భూ సర్వే అనంతరమే హక్కులకు సాధికారత లభిస్తుందని భావిస్తున్నారు.

Dharani Portal Issues : రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు వేదిక లేకపోవడంతో యజమానులకు ఇబ్బందిగా మారింది. ఆర్వోఆర్​- 2020 ద్వారా అమల్లో ఉన్న రెవెన్యూ కోర్టులను తొలగించారు. కనీసం సీసీఎల్‌ఏ స్థాయిలోనూ సమస్యల పరిష్కారానికి వీలు కల్పించలేదు. దీంతో పేరు మార్పులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చట్టాల్లో మార్గదర్శకాలు లేక పార్ట్‌-బీలో చేర్చిన 11 లక్షల ఎకరాలకు పరిష్కారం లభించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ప్రత్యేకంగా ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జరగబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 2020 ఆర్వోఆర్‌ చట్టానికి సవరణ చేయండం కన్నా నూతన చట్టాన్ని తీసుకురావడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి పోర్టల్‌ మార్పుపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ధరణి పోర్టల్​ పేరు మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే అందుబాటులోకి 'భూ భారతి' - వారం, పది రోజుల్లో లక్షకు పైగా సమస్యల పరిష్కారం - TG GOVT ON Dharani Portal Issues

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.