ETV Bharat / state

రైతులకు గుడ్ న్యూస్ : డ్రాగన్ ఫ్రూట్స్​​తో భారీగా సంపాదించండి- ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది! - Telangana Govt orchard promotion - TELANGANA GOVT ORCHARD PROMOTION

Telangana Govt orchard promotion : మీరు డిమాండ్​ అధికంగా ఉన్న డ్రాగన్​ ఫ్రుట్​ వంటి పండ్ల తోటలను సాగు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ కథనం మీ కోసమే! రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు సబ్సిడీ అందించనుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Telangana Govt orchard promotion
Telangana Govt orchard promotion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 1:49 PM IST

Orchard Development in Telangana : ఇటీవల కాలంలో రాష్ట్రంలో డ్రాగన్​ ఫ్రూట్​, నిమ్మ, బత్తాయి, జామ వంటి వివిధ రకాల పండ్లకు డిమాండ్​ భారీగా పెరిగిపోయింది. మన దగ్గర పండ్ల తోటల సాగు తక్కువగా ఉండడంతో మామిడికాయలను తప్ప.. మిగతా అన్ని పండ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో మార్కెట్లో అన్ని రకాల పండ్ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. పండ్ల తోటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు ప్రోత్సహం కల్పించేందుకు సన్నహాలు చేస్తోంది. అయితే, పండ్ల సాగు కోసం అర్హులైన రైతులు ఎవరు ? ఎన్ని రకాల పండ్లకు ప్రోత్సాహం అందిస్తారు ? ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి రానుంది ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఇతర పంటలతో పోలిస్తే పండ్ల తోటల సాగు కొంత లాభాసాటిగా ఉంటుంది. అలాగే వీటికి మార్కెట్లో కూడా డిమాండ్​ ఎప్పటికీ తగ్గదు. అయితే, తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) అనుసంధానం చేసి వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిద్వారా ప్రతి మండలానికి 50 ఎకరాల్లో పండ్లతోటల సాగును ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఎవరు అర్హులు ?

పండ్ల తోటల సాగులో భాగంగా రాష్ట్రంలో ఐదెకరాలలోపు సాగుభూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు రాయితీ కల్పించి పండ్లతోటలను ప్రోత్సహించాలని ఆలోచిస్తున్నారు. అలాగే రైతులకు ఉపాధి జాబ్​ కార్డు కూడా ఉండాలి. వ్యవసాయ, ఉద్యాన (హార్టికల్చర్‌), నరేగా శాఖ సమన్వయంతో రైతులను ఎంపిక చేస్తారు.

సబ్సిడీ అందించే పండ్ల తోటలు ఇవే!

వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి మండలానికి 50 ఎకరాల విస్తీర్ణంలో పండ్లతోటల సాగును ప్రోత్సహించాలను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇందులో భాగంగా డిమాండ్​ ఉన్న పండ్లకు సబ్సిడీ అందిస్తారు. డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి, సపోట, ఆపిల్​ బేర్, నిమ్మ, జామ, జీడిమామిడి, దానిమ్మ, మామిడి, పంటలతో పాటు పొలం గట్లపై వేసుకునే కొబ్బరి తోటలు, కరోంద (వాక్కాయ), చింత చెట్లు, మునగ, నేరేడు వంటి 16 రకాల పండ్ల తోటలకు సబ్సిడీ అందించనున్నారు.

సాయం ఇలా చేస్తారు ?

పండ్ల తోటల సాగుకు ఎంపికైన రైతులకు మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులు అధికారులు చెల్లిస్తారు. అయితే రైతు భూమిలోని సారాన్ని బట్టి ఏ పండ్ల తోటలను సాగు చేయాలన్నది ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించి నిర్ణయిస్తారు. మొక్కలు నాటడానికి గుంతలు తీసే కూలీల ఖర్చు, తోట చుట్టూ కంచె ఏర్పాటు, ఎరువుల కొనుగోలు వంటి ఖర్చులను రైతులకు అందిస్తారు. ఇంకా డ్రిప్ ఇరిగేషన్​పై కూడా రాయితీ కల్పిస్తారు. పంట మొదటి దిగుబడి వచ్చే వరకు మీకు సాయం అందుతుంది. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, మిగిలిన వారికి 90 శాతం మేర సబ్సిడీపై మైక్రో ఇరిగేషన్ రూల్స్​ ప్రకారం డ్రిప్​ పరికరాలను పంపిణీ చేయనున్నారు. అలాగే పండ్ల తోటల పెంపకంపై ఎప్పటికప్పుడు అధికారులు రైతులకు సలహాలు, సూచనలు చేస్తారు.

ఇవి కూడా చదవండి :

రుణమాఫీ కాలేదా అయితే అర్జీ ఇవ్వండి - ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే?

'మీకు లక్షన్నర రుణమాఫీ కాలేదా? - ఐతే ఈ నంబర్​కు వాట్సాప్ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.