ETV Bharat / state

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ - ఉత్తర్వులు జారీ

స్సీ వర్గీకరణపై సిఫార్సుల కోసం హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ కమిషన్ - 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచన

One Man Commission For SC Classification
One Man Commission For SC Classification (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 9:30 PM IST

One Man Commission For SC Classification : ఎస్సీ వర్గీకరణపై సిఫార్సులు చేసేందుకు ఏకసభ్య కమిషన్​ను ప్రభుత్వం నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత అరవై రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్​కు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీలను, ఉపకులాలను గ్రూపులుగా వర్గీకరించి ఇప్పుడున్న రిజర్వేషన్​ను విభజిస్తూ కమిషన్ ప్రభుత్వానికి సూచించనుంది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని అధ్యయనం చేయాలని కమిషన్​కు ప్రభుత్వం తెలిపింది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్​ను కోరింది.

ఆ అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి : విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనకబాటును కూడా పరిశీలించాలని పేర్కొంది. ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని కమిషన్​కు ప్రభుత్వం తెలిపింది. కమిషన్​కు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఎస్సీ అభివృద్ధి సంస్థ కమిషనర్​ను ఆదేశించింది. కమిషన్​కు అవసరమైన సమాచారాన్ని అందచేయాలని వివిధ శాఖలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కమిషన్ నివేదిక వచ్చాకే జాబ్​ నోటిఫికేషన్లు : ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్​ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య న్యాయ కమిషన్​ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని కమిషన్​ సమగ్రంగా అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు ఏంటంటే? : షెడ్యుల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి కొద్ది రోజుల క్రితం అత్యంత కీలకమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. 2 దశాబ్దాలుగా నలుగుతున్న వ్యాజ్యానికి ఓ ముగింపునిస్తూ వర్గీకరణకు మార్గం సుగమం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. సామాజిక స్థితిగతుల ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ల కోటాలో ఎవరి వాటా ఎంతో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం.

ఏక సభ్య కమిషన్ నివేదిక సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్

'2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ' - క్యాబినెట్​ సబ్​ కమిటీ కీలక సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.