Telangana Govt Debt 2024 : తెలంగాణ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-2024 బడ్జెట్ అంచనాల మేరకు రాకపోవడంతో సర్కార్ తంటాలు పడుతోంది. తాజాగా మరో రూ.1,718 కోట్ల రుణాల సేకరణకు బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టింది. వీటితో కలిపి ఈ నెలలోనే మొత్తం బాండ్ల విక్రయాలపై తీసుకున్న అప్పులు రూ.7,718 కోట్లకు చేరనున్నాయి. ఆదాయం లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించకపోవడంతో రూణాలు తెచ్చి పెండింగ్ బిల్లులకు నగదు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Ts Govt Income Problems : ఈ నెలాఖరులోగా డబ్బు విడుదల చేయకపోతే మంజూరైన బిల్లులు మురిగిపోతాయని ఉద్యోగులు, గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరిస్థితి మొదాలుకు వస్తుందని వాపోతున్నారు. వీరందరికి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.40,000ల కోట్లకు పైగా ఉన్నందున ఇప్పటికిప్పుడు సర్దుబాటు చేయలేకపోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
సరిపోని ఆదాయం : ఈ సంవత్సరం పన్నుల కింద మొత్తం రూ.1.52 లక్షల కోట్ల ఆదాయం రాబట్టాలని రాష్ట్ర బడ్జెట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ అంచనా వేసింది. ఇప్పటివరకు రూ.1.30 లక్షల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి మరో ఆరు పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం అప్పులు, పన్నుల ద్వారా ఆదాయం రూ.2.59 లక్షల కోట్లకు పైగా ఉంటుందని బడ్జెట్ అంచానా వేశారు. ఇందులో సేకరించే రూ.38,234,94 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. ఇప్పటివరకూ సమకూరిన ఆదాయం సుమారు రూ.2.10 లక్షల కోట్లలోపే ఉంది.
రాష్ట్రం మరో రూ.1,000 కోట్ల అప్పు.. ఇప్పటి వరకు ఎంత చేసిందంటే?
ఈ ఏడాది మొత్తం రూ.38,234.94 కోట్ల రుణాలను ప్రభుత్వం సేకరించాలని అనుకుంది. కానీ గత నెలాఖరుకే అంతకన్న ఎక్కువగా రూ.42,852 కోట్లు తెలంగాణ సర్కార్ తీసుకుంది. గతంలో తీసుకున్న అప్పులపై (Telangana Govt Debt) వడ్డీల కింద చెల్లింపులు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రూ.2,000ల కోట్లకు పైగా అదనపు భారం పెరిగింది. ఉద్యోగుల జీతాల రూపంలో అదనంగా రూ.3,000ల కోట్లు పెరిగింది. ఈ ఏడాది మొత్తం రూ.2.46 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలనేది లక్ష్యం కాగా అందులో రూ.2 లక్షల కోట్లలోపే ఖర్చు అయింది. రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఈ సంవత్సరం రూ.56.062 కోట్లు ఉండవచ్చని బడ్జెట్లో అంచనా వేస్తే 10 నెలలు ముగిసేటప్పటికే రూ.40,852 కోట్లుగా నమోదైంది.
Telangana Debt Consolidation: అప్పులపై స్పష్టత.. బాండ్ల విక్రయాల కోసం ఎదురుచూపులు
కేంద్రం ఇవ్వకపోవడంతో అప్పులే దిక్కుగా మారి : తెలంగాణ ఆదాయంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.41,259 కోట్లు రావోచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి నాటికి కేవలం 14.17 శాతమే అంటే రూ.5844.63 కోట్లు వచ్చింది. గత సంవత్సరంలో ఇదే పద్దు కింద ఇదే కాలవ్యవధిలో అంచనాలో 19.21శాతం వచ్చాయి. ఈ సంవత్సరం అంతకన్నా 5 శాతం తక్కువ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి గ్రాంట్లు సరిగా రాకపోవడంతో ద్రవ్యలోటును అధికమించేందుకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
బాండ్ల విక్రయం ద్వారా రుణమొత్తాన్ని రూ.500 కోట్లకు తగ్గించిన ప్రభుత్వం