ETV Bharat / state

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కూల్ టైమింగ్స్​లో మార్పు - New School Timings in Telangana - NEW SCHOOL TIMINGS IN TELANGANA

School Timings Change in Telangana : విద్యార్థులకు అలర్ట్. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి ఉదయం 9 గంటలకే ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులు తెరచుకోనున్నాయి.

New School Timings in Telangana 2024
New School Timings in Telangana 2024
author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 2:50 PM IST

New School Timings in Telangana 2024 : తెలంగాణలో జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలు మారాయి. 2022-23 విద్యాసంవత్సరం వరకు ఆ పాఠశాలలు ఉదయం 9:00 గంటలకే తెరుచుకునేవి. గత విద్యాసంవత్సరం(2023-24)లో 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్చారు. అయితే, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఉదయం 8:00 గంటలకే బస్సులెక్కి వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉదయం 9:30 గంటలకు వెళ్లడం వల్ల సర్కార్ బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి వివరించారు.

ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9:00 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనకు బుర్రా వెంకటేశం ఆమోదం తెలిపారు. ఉన్నత పాఠశాలలు మాత్రం మార్నింగ్ 9:30 గంటల నుంచే పనిచేస్తాయి. వాటి పనివేళలను కూడా ఉదయం 9:00 గంటలకే మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత పాఠశాలలను ఉదయం 9:30 గంటలకు తెరిస్తే సాయంత్రం 4:45 గంటల వరకు విద్యార్థులు బడిలోనే ఉండాల్సి ఉంటుందని, చలి, వర్షాకాలాల్లో వారు ఇళ్లకు వెళ్లేసరికి ఆలస్యమై, బాలికలకు రక్షణ కరవవుతుందని నిపుణులు అంటున్నారు.

‘గణితం’ బాధ్యత భౌతికశాస్త్రం ఉపాధ్యాయులదే : మరోవైపు ఆరు, ఏడు తరగతుల గణితం సబ్జెక్టును ఇక నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ రెండు తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

TG Academic Calendar 2024-25 : మరోవైపు 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. ఈ సంవత్సరం జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని వివరించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజులు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నట్టు తెలంగాణ సర్కార్ వెల్లడించింది.

వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోపు పదో తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్‌ పరీక్షలు పూర్తిచేయనున్నట్టు వివరించింది. మార్చిలో పదోతరగతి పరీక్షలు ఉంటాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది.

టెక్నికల్​ కోర్సుల్లో చేరండి - తక్కువకాలంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందండి! - Technical Courses After 12th

సక్సెస్​ ఫుల్ స్టూడెంట్స్​కు - ఈ అలవాట్లు ఉండవు! - Successful Student Quit Habits

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.