ETV Bharat / state

తెలంగాణ ఉపాధ్యాయులకు మరోసారి గుడ్‌న్యూస్‌ - త్వరలోనే మరింత మందికి ప్రమోషన్స్ - Tg govt to promote another 1500 - TG GOVT TO PROMOTE ANOTHER 1500

Teachers Promotions in Telangana : రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే మరింత మందికి పదోన్నతులు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల కల్పించిన ప్రమోషన్స్‌తో ఏర్పడిన ఖాళీలను పదోన్నతులు కల్పించి భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 12:34 PM IST

Another 1500 Teachers Promotions Soon : ఇటీవల రాష్ట్రంలో 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రమోషన్లు పొందిన తర్వాత కూడా కొన్ని ఖాళీలు మిగిలిపోయి ఉన్నాయి. వాటికి కూడా త్వరగా పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జిల్లాల వారీగా సబ్జెట్​ల వారీగా ఖాళీలు, సీనియారిటీ జాబితాను రూపొందించి రెండు రోజుల్లో పంపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్​ కార్యాలయం అధికారులు డీఈవోలకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 వరకు ఖాళీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వీరందరికీ పదోన్నతులు లభిస్తాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

హైకోర్టులో పదోన్నతుల కేసు : రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన వాటిని కూడా భర్తీ చేస్తామని ఇటీవల హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే అందుకు విద్యాశాఖ కూడా కసరత్తు చేస్తోంది.

ఆప్షన్లలో ఖాళీలు ఏర్పడిందిలా : కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో సుమారు 19,000 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఉపాధ్యాయులు రెండు, మూడు పోస్టుల్లో పదోన్నతులు పొందేందుకు అర్హత ఉండటంతో వారంతా వాటన్నింటికీ ఆప్షన్​లు ఇచ్చుకున్నారు. ఉదాహరణకు ఒక సెకండరీ గ్రేడ్​ టీచర్​(ఎస్​జీటీ) బీఏ, బీఈడీ చదివి ఉన్నారు. ఆయన బీఈడీలో తప్పనిసరిగా రెండు మెథడాలజీలు చదివి ఉన్నందున స్కూల్​ అసిస్టెంట్​ రెండు సబ్జెక్టులకు అర్హత సాధిస్తారు.

ఒకవేళ ఆయన డీఈడీ కూడా చేసి ఉంటే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పదోన్నతి పొందేందుకు అర్హత ఉంటుంది. ఆయన మూడు ఆప్షన్లనూ ఇచ్చుకొని పీఎస్​ హెచ్​ఎంగా చేరవచ్చు. దీంతో రెండు స్కూల్​ అసిస్టెంట్​ పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా సీనియారిటీ ఆధారంగా ఖాళీలు ఉన్నప్పటికీ పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.

పదోన్నతుల ప్రక్రియకు ఆన్​లైన్​ కంటే మాన్యువల్​ బెస్ట్​ : మల్టీజోన్​-1లో గత ఏడాదే గెజిటెడ్​ హెచ్​ఎంల పదోన్నతులు ఇచ్చారు. మల్టీజోన్​-2లో మాత్రం ఇటీవల పదోన్నతులు కల్పించారు. అందువల్ల మల్టీజోన్​-2 మాదిరిగా జోన్​-1కు కటాఫ్​ తేదీని 2024 జూన్​1వ తేదీగా పరిగణించింది. దీంతో అప్పటివరకు ఉన్న ఖాళీలను ప్రమోషన్లు ద్వారా భర్తీ చేయాలని టీఆర్​టీఎప్​ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్​ డిమాండ్​ చేశారు. పదోన్నతుల ప్రక్రియను ఆన్​లైన్​ విధానంలో కాకుండా మాన్యువల్​గా చేసి ఉంటే ఖాళీల సమస్య ఏర్పడి ఉండేది కాదన్నారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతుల పండగ - 18,942 మంది టీచర్లకు లబ్ధి - Teachers Promotion in Telangana

ఉపాధ్యాయ పదోన్నతులపై హైకోర్టు ఆగ్రహం - తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచన - TG HC on Teachers Transfer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.