ETV Bharat / state

రుణమాఫీ కాని రైతులకు శుభవార్త - రేపటి నుంచి సర్వే - వివరాల నమోదుకు యాప్​ - RYTHU BHAROSA APP FOR FARMERS

Survey for Rythu Runa Mafi : రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ రేపటి నుంచి సర్వే చేపట్టనుంది. అర్హులై ఉండి మాఫీ అవ్వని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం రైతుభరోసా పంట రుణమాఫీ యాప్‌ రూపొందించారు. అటు రూ. 2లక్షలు దాటి రుణం వారి నుంచి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయశాఖ అనుమతించింది.

Rythu Bharosa Panta Runa Mafi App
Survey for Rythu Runa Mafi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 7:06 AM IST

Updated : Aug 26, 2024, 7:11 AM IST

Telangana Govt Initiated Rythu Bharosa Panta Runa Mafi App : అర్హులై ఉండి రేషన్‌కార్డు లేక, ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ‘రైతుభరోసా పంట రుణమాఫీ యాప్‌’ను రాష్ట్ర వ్యవసాయశాఖ రూపొందించింది. ఈ యాప్‌ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించింది. రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది.

ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. రేపటి నుంచి సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్‌కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాల సేకరణ : రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయాధికారులు వెళతారు. ముందుగా వారి రుణఖాతాలు, ఆధార్‌కార్డులను తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే గాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధ్రువీకరణపత్రం తీసుకుంటారు. అందులో యజమాని తన రుణఖాతా, బ్యాంకు బ్రాంచి వివరాలతోపాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతోపాటు మొబైల్‌ నంబర్‌ రాయాలి. వీటిని ధ్రువీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది.

రూ. 2 లక్షలపైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయశాఖ ఆదివారం బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా స్పష్టతనిచ్చింది. అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేదని వెల్లడించలేదు. దశలవారీగా చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.

రుణమాఫీ కాలేదా అయితే అర్జీ ఇవ్వండి - ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే? - Farmers on Loan Waiver Issues

సాంకేతిక చిక్కులు, కర్షకులకు చుక్కలు - రుణమాఫీ కాలేదంటూ వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు - Farmers on RunaMafi

Last Updated : Aug 26, 2024, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.