ETV Bharat / state

మూడు జోన్లగా హైడ్రా విభజన - ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సన్నాహాలు - Hydra Extension Into Zones - HYDRA EXTENSION INTO ZONES

Hydra Extension : అక్రమ కట్టడాలు నిరోధించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేసే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకి అనుగుణంగా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. హైడ్రా పరిధిని మూడుజోన్లగా విభజించనున్నారు. అక్రమ కట్టడాల నిరోధానికి పురపాలక చట్టంలోనూ మార్పులు చేయాలని సర్కార్‌ భావిస్తోంది.

Hydra Extension into Three Zones
Hydra Extension (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 9:17 AM IST

Updated : Sep 7, 2024, 9:29 AM IST

Hydra Extension into Three Zones in GHMC : విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ-హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్​ఎండీఎ వరకు విస్తరించనుంది. మొత్తంగా వ్యవస్థను మూడుజోన్లుగా విభజించి, వాటి బాధ్యతను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ను సెంట్రల్‌ జోన్‌గా సైబరాబాద్‌ను నార్త్‌ జోన్‌గా, రాచకొండను సౌత్‌జోన్‌గా విభజించనుంది.

వాటికి జోనల్‌ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఆ మూడు జోన్లను చీఫ్‌ కమిషనర్‌ పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది. రెండు నెలల క్రితం ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకి చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. ఆ విషయంపై ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల తర్వాత శాసనసభను ప్రొరోగ్‌ చేసినందున ఆర్డినెన్స్‌ జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ వివరించారు. ఈ మేరకు వారం, పది రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఎస్పీ స్థాయి అధికారికి ఒక్కో జోన్‌ బాధ్యత : వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశ పెట్టనుంది. హైడ్రాకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీస్‌ వ్యవస్థను తీసుకురానుంది. సాధారణ పోలీసులని హైడ్రా అవసరాల కోసం వినియోగిస్తే రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో నాలుగోది అవుతుంది. పార్లమెంటు భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఉంది.

ఇది దేశంలోనే తొలి ప్రత్యేక పోలీస్‌ వ్యవస్థ. ఇటీవల తెలంగాణలో సైబర్‌సెక్యూరిటీ, నార్కొటిక్స్‌ విభాగాలకు రెండు ప్రత్యేక ఠాణాలు ప్రారంభించారు. హైడ్రా కోసం మరోకటి ఏర్పాటు చేయనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి ఆ రాణాను పర్యవేక్షిస్తారు. సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఎస్​హెచ్​ఓ వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది. అక్రమ నిర్మాణాలు కట్టడి చేసేందుకు పురపాలక చట్టంలోనూ మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అక్రమ కట్టడాలు పెచ్చుమీరుతుండటంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని, వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

పురపాలక చట్టంలోనూ మార్పులు : భవన అనుమతులు జారీ చేసేప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో పదిశాతాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే ఆ 10 శాతం ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది. లేదంటే అక్రమంగా నిర్మించినంత వరకు సంబంధిత కట్టడాన్ని కూల్చేస్తుంది. ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకొని బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

'హైడ్రా' పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలుకే - కమిషనర్ రంగనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ - HYDRA RANGANATH WARNING

కొద్దిరోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాదు - ఆక్రమణలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తాం : రంగనాథ్ - Ranganath about Hydra Operations

Last Updated : Sep 7, 2024, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.