ETV Bharat / state

భూముల ధరల పెంపుపై సర్కార్ కసరత్తు - దాదాపు రూ.4 వేల కోట్ల అదనపు రాబడి వస్తుందని అంచనా - TG Govt To Increase Land Price 2024

Telangana Govt To Increase Land Price 2024 : భూములు, భవనాల మార్కెట్‌ ధరల పెంపు శాస్త్రీయంగా ఉండేలా చూడాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో రెండుమార్లు అశాస్త్రీయంగా మార్కెట్‌ ధరలను సవరించారని భావిస్తున్న ప్రభుత్వం కొన్నిచోట్ల నిర్దేశించిన ధరల కంటే అధికంగా పెరిగినట్లు గుర్తించింది. ధరల పెంపుపై మరింత లోతైన అధ్యయనం చేసి విధివిధానాలు రూపొందించాలని యోచిస్తోంది. మార్కెట్‌ విలువను దాదాపు 30 శాతం పెంచడం ద్వారా రూ.4,000ల కోట్ల అదనపు రాబడి వస్తుందని సర్కార్ అంచనా వేస్తోంది.

Telangana Govt To Increase Land Price 2024
Telangana Govt To Increase Land Price 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 6:58 AM IST

రాష్ట్రంలో మరోసారి భూములు, భవనాల మార్కెట్‌ ధరల పెంపు (ETV Bharat)

Telangana Govt Exercise To Hike Lands Price 2024 : ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021 జులై 22న అప్పటి ప్రభుత్వం భూములు, భవనాల మార్కెట్‌ ధరలు పెంచింది. ఎలాంటి కసరత్తు చేయకుండానే అప్పటికే ఉన్న స్లాబ్‌లపై పెంచారు. అదేవిధంగా 4 శాతం ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్‌ ఫీజును 5.5 శాతానికి పెంచారు. వ్యవసాయ భూముల ధరలు ఎక్కువ భాగం 100 శాతం, అంతకుమించి పెంచగా, స్థిరాస్తి భూముల ధరలు 50 శాతం, అపార్ట్‌మెంట్‌ ధరలు 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్‌ భూముల, భవనాల మార్కెట్‌ విలువలు, స్టాంపుడ్యూటీ పెంపు వల్ల రాబడి రెట్టింపునకు మించి వచ్చింది.

Market Value of Lands in Telangana : 2020-21లో రూ.5,243.28 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.7,000ల కోట్లకు పైగా అదనంగా పెరిగి 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.12,372.73 కోట్లు వచ్చింది. అనంతరం 2022 ఫిబ్రవరి 1న రెండోసారి వ్యవసాయ భూముల, స్థిరాస్తి స్థలాలు, భవనాల మార్కెట్‌ ధరలు పెంచారు. ఈసారి స్టాంపుడ్యూటీ జోలికి వెళ్లకుండా భూములు, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్ ధరలు మాత్రమే పెంచారు. వ్యవసాయ భూములపై 50 శాతం, ఫ్లాట్స్‌పై 35 శాతం అపార్ట్‌మెంట్లపై 20 శాతం లెక్కన పెంచారు. తద్వారా సాధారణ వార్షిక ఆదాయం రూ.2500 కోట్ల నుంచి రూ.3,000ల కోట్ల వరకు అదనంగా పెరుగుతుందని అంచనా వేశారు.

Telangana Stamps and Registrations Revenue : వాస్తవానికి 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.12,372.73 కోట్లుగా ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం ఏకంగా రూ.14,228 కోట్లకు పెరిగింది. దాదాపు రెండు వేల కోట్లు మేర రాబడి అదనంగా పెరిగింది. వాస్తవానికి ప్రతిఏడాది మార్కెట్‌ ధరలు సమీక్షించి సవరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆ ధరలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన లేకుండానే అప్పటికే ఉన్న ధరలపై కొంత శాతం పెంచడంతో ఇబ్బందులు తలెత్తాయి. కమర్షియల్‌ ప్రాంతాలను గుర్తించడంలో సరైన విధానం పాటించకపోవడం సమస్యలను తెచ్చిపెట్టిందని సర్కార్ భావిస్తోంది.

వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కమిటీలు : గత సర్కార్ హయాంలో మార్కెట్‌ ధరలు పెంచినప్పుడు శాస్త్రీయత లోపించడంతో ఈసారి ఆలాంటి తప్పిదం జరగకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రస్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మార్కెట్‌ ధరలను ఎలా పెంచాలన్న అంశంపై విధివిధానాలు రూపకల్పన చేసి ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌లు, జల్లా రిజిస్ట్రార్లకు పంపుతారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కన్వీనర్‌గా తన పరిధిలోని వ్యవసాయ భూముల ధరలకు సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటవుతాయి. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని ఏవి వాణిజ్య స్థలాలు, ఏవి వాణిజ్య స్థలాలు కావో పరిశీలనచేసి నిర్ధారిస్తారు. ప్రధాన రహదారులను అనుకొని ఉన్న స్థిరాస్తులు, వాణిజ్య అవసరాలకు వాడుకునే ప్లాట్స్‌ గుర్తిస్తారు.

శాస్త్రీయంగా భూముల ధరల పెంపు : క్షేత్రస్థాయిలో సందర్శించి రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువులు పెంచినట్లయితే ఆదాయం భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో రెండు సార్లు పెంచినప్పుడు భారీగా రాబడులు పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో మూడోసారి ధరల పెంపు పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా జరపాలని సర్కార్ యోచిస్తోంది. రెండేళ్ల తర్వాత మార్కెట్‌ ధరలను సవరిస్తున్నందున కనీసం 30 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కనీసం రూ.4,000ల కోట్ల అదనపు రాబడి ప్రభుత్వ ఖజానాకు వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అంచనా వేస్తోంది.

తెలంగాణలో తగ్గని రియల్ ఎస్టేట్ జోరు - గతేడాది కంటే 15 శాతం అధికంగా రిజిస్ట్రేషన్లు - House Sales Increased in Hyderabad

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.