Telangana Government Announces IR : ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా మధ్యంతర భృతిని ప్రకటించింది. మూలవేతనంలో 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులకు గతేడాది అక్టోబరు 2న ఐఆర్ మంజూరు చేసింది. తమకు కూడా మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేసే నాన్ టీచింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. అంగీకరించిన ప్రభుత్వం వారికి కూడా ఐఆర్ వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
