Telangana Fake Passports Scam Latest Update : నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్‌పోర్టుల జారీ కేసులో అబ్దుస్ సత్తార్ ముఠా లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నిరక్షరాస్యులతో పాటు పాఠశాలకు రాని పదోతరగతి విద్యార్థులకు నకిలీ పత్రాలు తయారుచేసి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో అబ్దుస్ సత్తార్ కీలకంగా వ్యవహరించడంతో సీఐడీ అధికారులు అతడిని విచారించి కీలక వివరాలు రాబట్టారు. నకిలీ విద్యార్హత పత్రాలను సృష్టించడం వెనక ఇమ్మిగ్రేషన్ చెక్‌నాట్ రిక్వయిర్డ్ కేటగిరీ పాస్‌పోర్టులు పొందే కుయుక్తులకు ముఠా పాల్పడినట్లు తేలింది.
భారత పౌరులుగా విదేశీయులకు పాస్‌పోర్టులు - ముఠా గుట్టురట్టు చేసి కటకటాల్లోకి
వాస్తవానికి పాస్‌పోర్టు (Passport) తీసుకునేందుకు జనన ధ్రువపత్రం (Birth Certificate) కోసం సాధారణంగా పదోతరగతి మెమోను ప్రామాణికంగా తీసుకుంటారు. పదో తరగతి ఉత్తీర్ణులు కాని వారికి ప్రత్యామ్నాయ ధ్రువీకరణపత్రాలు అవసరమవుతాయి. అయితే అలాంటి వారికి ఈఎస్ఆర్(ESR) కేటగిరీ పాస్‌పోర్టులనే జారీ చేస్తారు. ఆ కేటగిరీ పాస్‌పోర్టు కలిగి ఉన్నవారు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి (Gulf Countries ) నిమిత్తం కూలీ పనుల కోసం వెళ్తారు. వారిని నైపుణ్యం లేని కూలీలుగా గుర్తించి పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. వారికి తక్కువ వేతనాలు మాత్రమే లభిస్తాయి. ఈ కేటగిరీ పాస్‌పోర్టుదారులు తప్పనిసరిగా ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ కార్యాలయానికి వెళ్లి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్(Visa Immigration) చేయించుకోవాల్సి ఉంటుంది.
నకిలీ పాస్‌పోర్టు కేసు - వారిని దేశం దాటనీయకుండా సీఐడీ నిఘా
Fake Passports Scam in Hyderabad : ప్రస్తుతం 18 దేశాలను భారత ప్రభుత్వం ఈసీఆర్ (ECR) కేటగిరీ దేశాలుగా పరిగణిస్తోంది. ఆయా దేశాల్లో వలస కార్మికుల సంక్షేమం కోసం సరైన వ్యవస్థ లేని కార్మికులు పీఓఈని తప్పనిసరిగా సంప్రదించాలనే నిబంధన విధించింది. అయితే వీసా ప్రాసెసింగ్‌లో (Visa Processing) తప్పిదాలకు పాల్పడే బోగస్ ఏజెంట్ల ముఠాలు లోపాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఆ విధంగా కుయుక్తులు పన్నుతున్నాయి. రాష్ట్రం నుంచి ఉపాధి నిమిత్తం వెళ్లే వలస కార్మికులకు ఎక్కువగా 18 దేశాల్లో పనులుండటం ముఠా పన్నాగాలకు మరో కారణంగా కనిపిస్తోంది. పీఓఈ క్లియరెన్సు తప్పించుకునే ప్రయత్నంలో ఈసీఎన్ఆర్ (ECNR) పాస్‌పోర్టులకే ప్రాధాన్యమిస్తున్నట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది.
Fake Passport Gang Arrest: నకిలీ పాస్‌పోర్ట్ ముఠా గుట్టురట్టు