Telangana DSC Exams From July 18th : రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జులై 18వ తేదీ(గురువారం) నుంచి డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల అప్లికేషన్లు అందాయి. ఆన్‌లైన్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
మొత్తం 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు విడతల చొప్పున టీచర్ పరీక్షలు జరుగుతాయి. హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయని పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆఫీస్‌కు వస్తున్నారని, ఈ నేపథ్యంలో తప్పులను సరిదిద్ది అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామని అధికారులు తెలిపారు.
డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇదే..
- జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష
- జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
- జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
- జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
- జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్ పరీక్ష
- జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
Good News for DSC Aspirants : డీఎస్సీ పరీక్షలు వాయిదావేయాలంటూ అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ రాష్ట్ర సర్కార్ కనీసం వెనుకంజవేయలేదు. కానీ నిరుద్యోగులకు కాస్త ఊరటనిస్తూ త్వరలోనే ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీ ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇదే చివరి డీఎస్సీ కాదని, నిరసనలు మాని పరీక్షలుకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్షలు రాసే అభ్యర్థుల విషయంలో రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉంటే, అలాంటి వారు మార్నింగ్ ఎగ్జామ్ రాసిన చోటే రెండో పరీక్షకూ హాజరయ్యే వెసులుబాటు కల్పించింది.
ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకేచోట రాయొచ్చు - డీఎస్సీ అభ్యర్థులకు సూపర్ గుడ్‌న్యూస్ - TS DSC Exam Rules
త్వరలో మరో డీఎస్సీ - పోస్టులు ఎన్నో తెలుసా? - Deputy CM Bhatti Press Meet