ETV Bharat / state

ధరణి పెండింగ్ దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలి : సీఎస్ శాంతికుమారి - DHARANI PENDING APPLICATIONS 2024 - DHARANI PENDING APPLICATIONS 2024

Telangana Cs Review Meeting With Collectors : ఐదేళ్లలో 25వేల గ్రామ సమైక్య సంఘాలని కోటీశ్వరులను చేసే దిశగా త్వరలో విధాన నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. ఈ సీజన్ లో 20 కోట్ల మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేసి పరిరక్షించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారని యూరియా, ఇతర ఎరువుల పంపిణీని రోజూ పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నేటి నుంచి జరగనున్న రైతుసదస్సులు విజయవంతం చేయాలని సూచించారు.

CS Review Meeting
Telangana Cs Review Meeting With Collectors (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 9:30 AM IST

CS Shanti Kumari On Dharani Pending Applications : వనమహోత్సవం, మహిళాశక్తి, ప్రజాపాలన సహాయ కేంద్రాలు అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, ధరణి, ఉద్యోగుల బదిలీలు, గృహనిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసీజన్‌లో 20 కోట్ల మొక్కలు నాటాలని జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు. నాటిన ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేసి పరిరక్షించాలని సూచించారు. సీనియర్ అధికారులు గ్రామాలను దత్తత తీసుకొని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల గ్రామసమైక్య సంఘాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలన్న కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు.

ఇందిరా క్యాంటీన్లు : రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్య సాధనకు త్వరలోనే విధాన నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల్లో ఇప్పటికీ చేరని మహిళలను చేర్పించాలని కలెక్టర్లకు తెలిపారు. మహిళా సంఘాలు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు సకాలంలో తయారుచేశాయన్న శాంతికుమారి రెండో సెట్ త్వరలో పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇందిరా క్యాంటీన్లు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు. అసంపూర్తిగా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను రెండు వారాల్లో పూర్తి చేయించాలని కలెక్టర్లకు శాంతికుమారి స్పష్టంచేశారు.

"తెలంగాణను మెడికల్ టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతాం"

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు : గతేడాది ఇప్పటివరకు 44 లక్షల ఎకరాల్లో నాట్లువేయగా ఈ సీజన్‌లో ఇప్పటికే 50 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు సీఎస్‌ తెలిపారు. అన్ని మండలాల్లో యూరియా ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని పంపిణీని కలెక్టర్లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నేటి నుంచి జరగనున్న రైతు భరోసా సదస్సులను విజయవంతం చేయాలని ఆయా జిల్లాల్లోని రైతులు, రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని శాంతికుమారి ఆదేశించారు. వర్షాకాలంలో అతిసార, మలేరియా, చికన్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్దేశించారు.

ధరణి పెండింగ్‌ దరఖాస్తులు : ప్రజలను చైతన్య పర్చడంతో పాటు, దోమలు, లార్వా నిర్మూలన చర్యలు చేపట్టి ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రాలలో నిరంతరం పనిచేసే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ధరణి పెండింగ్‌ దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 20 వరకు పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 49 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఒక్కో సముదాయానికి కనీసం 20 ఎకరాల భూమిని వెంటనే సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర గ్రాంటును పొందేందుకు లబ్ధిదారుల వివరాలను అప్‌లోడ్ చేయాలని సీఎస్‌ శాంతికుమారి చెప్పారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు షురూ - ప్రైవేట్​ కాంటాలు తెరిస్తే చర్యలు తప్పవని సీఎస్​ హెచ్చరిక

ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయం పెంపుపై సీఎం సీరియస్‌ - ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.