ETV Bharat / state

NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి పీసీసీ పీఠం వరకు - మహేశ్‌కుమార్‌ గౌడ్‌ రాజకీయ ప్రస్థానమిదే - PCC President Mahesh Kumar Goud

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 5:44 PM IST

New PCC President Mahesh Kumar Goud : తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఎంపికయ్యారు. ఆయన ఎక్కడో నిజామాబాద్‌ జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి చేరారు. విద్యార్థి దశలోనే ఎన్‌ఎస్‌యూఐలో ప్రవేశించిన ఆయన, నేడు కాంగ్రెస్‌లో అత్యున్నత పదవి దక్కించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ రాజకీయ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

Mahesh Kumar Goud Political Life
New PCC President Mahesh Kumar Goud (ETV Bharat)

Mahesh Kumar Goud Political Life : తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్‌ కమిటీ నూతన అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈయన 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్‌నగర్‌లో సంపన్న గౌడ్‌ కుటుంబంలో జన్మించారు. స్థానికంగానే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన, నిజామాబాద్‌ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదివే సమయంలోనే మహేశ్‌ కుమార్ గౌడ్ నిజామాబాద్‌ ఎన్‌ఎస్‌యూఐలో ప్రవేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

చిన్నవయస్సులోనే ఎన్నికల్లో పోటీ : 1986 నుంచి 1990 వరకు ఎన్ఎస్‌యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, 1990 నుంచి 1998 వరకు ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1998 నుంచి 2000 వరకు యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి చిన్న వయస్సులోనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. తిరిగి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినా, ఆ ఎన్నికల్లో సదరు స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం : 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా పని చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియామకమయిన సమయంలోనే 2021 జూన్‌ 26వ తేదీన మహేశ్‌కుమార్ గౌడ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం దక్కింది. 2023 జూన్ 20వ తేదీన తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించినా, ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో పోటీ నుంచి ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2024 జనవరి 29వ తేదీన తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.

ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లలో పని చేసి 38 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో సేవలందించడం, పార్టీ బలోపేతానికి పని చేయడం, గడిచిన మూడు సంవత్సరాలుగా పీసీసీ సంస్థాగత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తూ నాయకులతో, కార్యకర్తలతో విస్తృతంగా తత్సంబందాలు కలిగి ఉండడం, అధిష్టానం చెప్పిన మేరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం ఆయనకు పదవిని కట్టబెట్టేలా చేశాయి.

తెలంగాణ పీసీసీ ఛీప్‌గా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ - AICC ANNOUNCE TELANGANA PCC CHIEF

మూడు జోన్లగా హైడ్రా విభజన - ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సన్నాహాలు - Hydra Extension Into Zones

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.