ETV Bharat / state

అభ్యర్థుల ఎంపికపై నాయకుల అభిప్రాయాలు - గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం - Telangana lok Sabha Elections

Telangana Congress MP Candidates 2024 : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్న దీపా దాస్‌మున్షీ బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నాయకుల అభిప్రాయాలపై సమీక్ష చేసిన సీఎం బలాబలాలపై ఆరా తీసినట్లు తెలుస్తుంది.

Congress Focus on Second MP List
Telangana Congress MP Candidates 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 8:02 AM IST

అభ్యర్థుల ఎంపికపై నాయకుల అభిప్రాయాలు - గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం

Telangana Congress MP Candidates 2024 : లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే నల్గొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును రాష్ట్ర నాయకత్వం వేగవంతం చేసింది. ఏకాభిప్రాయం కుదరకపోవడం, కొత్తవాళ్లు ఎంపికపై అభ్యంతరాలు ఎదురవడంతో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. అభ్యర్థులు ప్రకటించాల్సిన నియోజకవర్గాలకు సంబంధించి నాయకులు తమ అభిప్రాయాల్ని దీప దాస్‌మున్షీకి తెలియజేశారు.

Congress Focus on MP Candidates Second List : ఏకాభిప్రాయ సాధన కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఈ అభిప్రాయాలతోపాటు సునీల్‌ కనుగోలు నిర్వహిస్తున్న ఫ్లాస్‌ సర్వేల వివరాలతో రెండు మూడు రోజుల్లో సమావేశం కానున్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించనుంది. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గాంధీ భవన్​లో అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో దీపాదాస్ మున్సీ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నాయకులు వ్యక్తపరచిన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్దులను చిత్తు చెయ్యగలిగే వారినే అభ్యర్థుల్ని నిలబెట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.

'కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష- ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు'

కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. అభ్యర్థులను ఆచితూచి ప్రకటిస్తుంది. అభ్యర్థుల ఎంపికపై నాయకుల అభిప్రాయాల సేకరణ కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో భాగంగా భిప్రాయ సేకరణ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవర్ని నియమించినా గెలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే పథకాలను అమలు చేశాం. కాంగ్రెస్ అధిష్ఠానం ఎవర్ని నియమించినా కష్టపడి వాళ్లని గెలిపించుకుంటాం.- కాంగ్రెస్ నాయకులు

Lok Sabha Polls 2024 : రాష్ట్రంలో 17 లోక్​సభ స్థానాలకు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ఆచితూచి ప్రకటిస్తోంది. అన్ని చోట్ల గెలుపు గుర్రాలనే బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్​ పార్టీకి 13 నుంచి 14 స్థానాలు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్​ అధినాయకత్వం భావించింది. అందులో భాగంగానే ఆ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి ఏ నేతలు వచ్చిన వెంటనే ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​ పార్లమెంటు(Hyderabad Lok Sabha Seat) పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు అధిష్ఠానం ఈ అంశంపై పూర్తి దృష్టి కేంద్రీకరించి, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పట్టుదలతో కనిపిస్తోంది.
లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణ చేస్తున్న కాంగ్రెస్​ అధిష్ఠానం

రూ.100 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్‌ కాలువ అనుసంధానం పనులకు శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.