ETV Bharat / state

దిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్‌ - నేడు రాహుల్ గాంధీతో భేటీ - CM Revanth Reddy Delhi Tour - CM REVANTH REDDY DELHI TOUR

CM Revanth Reddy Delhi Tour Updates Today : మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ వద్ద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తాజా పరిస్థితులపై సమీక్షించారు. కాంగ్రెస్ పెద్దలను కలవడానికి దిల్లీ వెళ్లిన ఆయన, అక్కడ తన అధికార నివాసంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి రాహుల్‌బొజ్జా, జలవనరుల సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌లతో చర్చించారు. నేడు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలతో సీఎం భేటీ అవుతారు. రైతు రుణమాఫీ విజయోత్సవ వేడుకలకు వారిని ఆహ్వానించనున్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 7:16 AM IST

CM Revanth Reddy To Meet Rahul Gandhi Today : దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ విజయోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించే అంశంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకొచ్చారు. 2022 మే 6న వరంగల్‌లో జరిగిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్‌ పార్టీ రూ.2 లక్షల రైతు రుణమాఫీని ప్రకటించింది. తాజాగా రుణమాఫీని అమలు చేసినందుకు గుర్తుగా అక్కడే వచ్చే నెలాఖరులో భారీ బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా పంపాలని సీఎం రేవంత్‌ నిర్ణయించారు. ఇదే అంశంపై రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో రేవంత్ నేడు చర్చించనున్నారు. వారిని రాష్ట్రానికి ఆహ్వానించేందుకు దిల్లీకి వచ్చారు. రాహుల్ గాంధీ అభిప్రాయన్ని తీసుకొని సభకు తేదీ నిర్ణయించాలన్న భావనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 9 గంటలవరకూ పార్టీనేతలెవర్నీ కలవలేదు. సోమవారం కలిసి చర్చించిన అనంతరం హైదరాబాద్‌ తిరుగుపయనమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.

వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు - పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి - SECUNDERABAD LASHKAR BONALU 2024

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై దిల్లీలో సమీక్ష: తాజాగా దిల్లీలో మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం తాజా పరిస్థితులపై సమీక్షించారు. కాంగ్రెస్ పెద్దలను కలవడానికి దిల్లీకొచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడి తన అధికార నివాసంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి రాహుల్‌బొజ్జా, జలవనరుల సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌లతో చర్చించారు. మేడిగడ్డ మరమ్మతులు, పరీక్షలపై ఎన్‌డీఎస్‌ఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ప్రాజెక్టు పరిస్థితులను లోతుగా సమీక్షనిర్వహించారు. శనివారం ఎన్‌డీఎస్‌ఏ వద్ద జరిగిన సమీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం మరోసారి ఇంజినీర్లు, నిపుణులు తదితరులతో నిర్వహించనున్న నేపథ్యంలో సమావేశంలో చర్చకు రాబోయే అంశాల గురించి ఆరా తీశారు.

మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తాజా స్థితిగతుల గురించి రేవంత్ రెడ్డికి వివరించారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలు, వెల్లడి కావాల్సిన విషయాలను గురించి తెలిపారు. సోమవారం జరగబోయే ఇంజినీర్ల స్థాయి సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఒక స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

దిల్లీకి చేరిన సీఎం రేవంత్‌ - కాంగ్రెస్‌ హైకమాండ్​తో సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.