Telangana Cabinet Meeting Today : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా మెట్రో రైల్ మార్గాల విస్తరణకు రూ.24,269 కోట్లతో మెట్రో రెండో ఫేజ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్ - ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో రైలు నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు విస్తరణ కూడా ఆమోదం తెలిపింది. ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కేబినేట్ అంగీకారం తెలిపింది.
ఈ నెల 31న ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తాం : పేదవాళ్లలో అతి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దీపావళి కానుకగా ఈ నెల 31న ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని వివరించారు. అదేవిధంగా దీపావళి పర్వదిన సందర్భంగా ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరోవైపు నవంబర్ 30లోపు కులగణన పూర్తి చేయాలని, రూ.6 వేలకు పైగా ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు.
మరికొన్ని కేబినెట్ నిర్ణయాలివే :
- మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కేబినెట్ పచ్చజెండా
- పీపీపీ విధానంలో రోడ్లు నిర్మాణానికి నిర్ణయం
- ఉస్మానియా ఆస్పత్రికి గోషామహల్‌లో స్థలం ఇవ్వాలని ఆమోదం
- గచ్చిబౌలి స్టేడియాన్ని స్పోర్ట్స్ వర్సిటీకి వాడాలని నిర్ణయం
- 8 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కొత్త కోర్టులకు సిబ్బంది ఇవ్వాలని నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు? - కులగణన షెడ్యూల్? - ఆ ప్రశ్నలన్నింటికీ నేడు సమాధానం!
'మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం - మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా!'