ETV Bharat / state

ఈ నెల 17న టీడీపీ-జనసేన మేనిఫెస్టో - ఏపీ భవిత కోసమే అంటూ నేతల వెల్లడి - TDP Janasena Manifesto 2024

TDP Janasena Manifesto 2024 : ఏపీలో అధికారంలోకి వస్తే తమ కూటమి ప్రజలకు ఏం చేస్తుందో తెలిపే పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 17వ తేదీన ప్రకటించాలని తెలుగుదేశం - జనసేన నిర్ణయించాయి. ఇందుకనుగుణంగా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు, ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను ఆవిష్కరించనున్నారు. దిల్లీ పొత్తులపై శుక్రవారంలోగా స్పష్టత వస్తుందనే అభిప్రాయాన్ని ఇరుపార్టీల నేతలు వ్యక్తం చేశారు. తెలుగుదేశం - జనసేన శ్రేణుల్ని పోలీసులు వేధిస్తే, వారికి అండగా నిలిచేందుకు ఓ ప్రత్యేక కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

TDP and Janasena Toll Free Number
Toll Free Number for TDP Janasena Party Workers
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 2:46 PM IST

Updated : Mar 7, 2024, 10:06 PM IST

తెలుగుదేశం - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన తేదీ ఖరారు

TDP Janasena Manifesto 2024 : ఈ నెల 17వ తేదీన తెలుగుదేశం -జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చిలకలూరిపేటలో తెలుగుదేశం - జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలిపారు. చిలకలూరిపేట బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీడీపీ-జనసేన నేతలు వెల్లడించారు.

టోల్ ఫ్రీ నెంబర్ (7306299999) : చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. డబ్బులు కట్టకున్నా ఒక పార్టీ సభలకు విపరీతంగా బస్సులు ఇస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. తమ సభకు బస్సులు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. పోలీసుల తీరు మారకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపారు.

Toll Free Number for TDP Janasena Party Workers : తెలుగుదేశం - జనసేన నేతలు, కార్యకర్తలపై వేధింపులు మానుకోవాలని కోరారు. పోలీసుల వేధింపుల నుంచి పార్టీ శ్రేణుల్ని కాపాడేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ (7306299999) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలన్నదే తెలుగుదేశం - జనసేన లక్ష్యంగా పేర్కొన్నారు. తెలుగుదేశం - జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాక వైఎస్సార్సీపీ వణికిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితులకు జగన్ తీసుకెళ్లారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

ఇదేందయ్యా ఇది!! - ఊళ్లో నిద్రపోవడం లేదని 600 మంది ఓట్లు తొలగింపు

పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత : తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu)కు దిల్లీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి వెళ్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. దిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా ఈ రాత్రికి దిల్లీ చేరుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నామన్నారు. తమ పొత్తుల్ని విచ్ఛిన్నం చేయటానికి ఓ వర్గం మీడియా చేసిన తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలు వేసుకుని కలసికట్టుగా సభను విజయవంతం చేస్తామని వెల్లడించారు. సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. నిన్న రాత్రి జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దుర్మార్గమని నాదెండ్లమనోహర్‌ అన్నారు. నియంత పాలన ప్రజాస్వామ్యంలో మంచిది కాదని ఆయనహితవుపలికారు. వీలైతే ఏదైనా వస్తువులు జనసేన సిబ్బంది ఉన్న చోట పెట్టి అక్రమంగా అరెస్టు చేయాలని చూసారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రతిపక్షాలపై కక్షసాధింపు కోసమే పెట్టడం దుర్మార్గమని నాదెండ్ల మనోహర్‌ దుయ్యబట్టారు.

హైకోర్టులో ఏపీ సర్కారు అబద్ధాలు - క్షమాపణలు కోరిన ఏజీ శ్రీరామ్‌

పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం - ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెడుతున్న ఏపీ సీఎం

Last Updated : Mar 7, 2024, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.