ETV Bharat / state

కౌంటింగ్​ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు - సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు - Case Filed On Sajjala Ramakrishna - CASE FILED ON SAJJALA RAMAKRISHNA

Case Filed on Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లిలో నమోదైంది. కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.

Case Filed on Sajjala Ramakrishna Reddy
Case Filed on Sajjala Ramakrishna Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 11:43 AM IST

Case Filed on Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని కౌంటింగ్ కేంద్రాలలో గొడవలకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాడేపల్లి కేసులు సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.

సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలని, అవతలివారు (ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి) అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలని అన్నారు. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలని తెలిపారు. అంతే తప్ప రూల్‌ అలా ఉందని, అందుకే దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదని సజ్జల స్పష్టం చేశారు.

మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ను ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందామని పిలుపునిచ్చారు. ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లు బాగా ఎక్కించాలని తెలిపారు. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

సిగ్గులేదారా? టీడీపీ ఏజెంట్లను బయటకు పంపండి'- 'ఏఎస్​ఐకి వార్నింగ్'- పిన్నెల్లి పర్వంలో దాగిన అరాచకాలెన్నో? - AP YSRCP Leaders Anarchy

బరితెగించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి - వీధిరౌడీని తలదన్నేలా ఈవీఎం ధ్వంసం - MLA Pinnelli EVM Destroy Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.