ETV Bharat / state

ప్రేయసితో కలిసి ఓయోలో బస - అర్ధరాత్రి ప్రియుడి అనుమానాస్పద మృతి - ఏం జరిగింది? - YOUNG MAN DIED IN OYO ROOM HYD - YOUNG MAN DIED IN OYO ROOM HYD

Young Man Died In Oyo Room : ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

Young Man Death In Oyo Room
Young Man Death In Oyo Room
author img

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 12:02 PM IST

Young Man Death In Oyo Room In Hyderabad : మరణమనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్న వాళ్లు కూడా ఒక్కసారిగా కళ్ల ముందే ప్రాణాలు వదులుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. మనిషి జీవితం నీటిబుడగ ప్రయాణం అంటూ చాలా మంది చెబుతుంటారు. ఇంతకు ముందు రోజుల్లో మనిషి జీవిత కాలం ఎంతా అంటే వందేళ్లనో డెబ్బై సంవత్సరాలనో చెప్పేవాళ్లు కానీ ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం చెప్పటం చాలా కష్టంగా మారింది.

ప్రస్తుతం జరుగుతున్న ఘటనలే అందుకు సాక్ష్యం. అయితే చాలా మంది అప్పటివరకు ఎంతో చురుకుగా ఉండి క్షణాల్లో తుదిశ్వాస విడుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. అసలేం జరిగిందంటే?

గంట వ్యవధిలో 7 ఇంజక్షన్లు ఇచ్చిన ఆర్‌‌‌‌ఎంపీ - వైద్యం వికటించి యువకుడు మృతి - Young Man died due to RMP Treatment

Young Man died In Oyo Room
మృతుడు హేమంత్‌ (28)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్‌ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి(27)తో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడగా అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రి ఎస్సార్‌నగర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో గది తీసుకొని బస చేశారు. మద్యం తాగి హేమంత్‌ రాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్లాడు. ఎంతకు బయటకు రాకపోవడంతో యువతి చూడగా అపస్మారకస్థితిలో పడి కనిపించాడు.

Suspicious Death Of Young Man In OYO : దీంతో యువతి హేమంత్‌ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి హేమంత్‌ను మంచంపై పడుకోబెట్టి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది పరీక్షించి అప్పటికే హేమంత్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హేమంత్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని దర్యాప్తు చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతి కారణాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు.

నన్ను మన్నించు కన్నా - కళ్లల్లో నీ రూపం నింపుకొని లోకం వీడుతున్నా - Woman dies due to electric shock

హైదరాబాద్​లో అమానుషం - కాగితాలు ఏరుకునే మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం - 45 Yrs OLD WOMAN RAPE IN KUKATPALLY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.