ETV Bharat / state

జగన్‌ అక్రమాస్తుల కేసు - సీబీఐ అఫిడవిట్‌పై అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం - SC on Jagan Illegal Assets Case - SC ON JAGAN ILLEGAL ASSETS CASE

Supreme Court on Jagan Illegal Assets Case : జగన్‌ అక్రమాస్తుల కేసుపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలు ఆశ్చర్యంగా ఉన్నాయన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్‌ 11కు వాయిదా వేసింది.

SUPREME COURT ON JAGAN CASE
Supreme Court on Jagan Illegal Assets Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 7:49 PM IST

Supreme Court on Jagan Illegal Assets Case: మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం, బెయిలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం భోజన విరామానికి ముందు విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే 2న సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను కోర్టు పరిశీలించింది. ఈ కేసులో నమోదు చేసిన కేసుల వివరాలు, ట్రయల్‌ పురోగతిపై సీబీఐ సుప్రీం కోర్టుకు నివేదించింది.

ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేశారని, ట్రయల్‌ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించారని అందులో తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలయ్యాయని వివరించారు. వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జీలు మారిపోతున్నారని, తాజా న్యాయమూర్తి కూడా రెండేళ్లు కాకుండానే బదిలీ అయ్యారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన : ఈ కేసులో నిందితులంతా శక్తిమంతులే అని సీబీఐ పేర్కొంది. సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కు సంబంధం లేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పష్టం చేశారు. కేసులు ట్రయల్‌ ప్రారంభం కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్‌ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

కేసులో డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పదేళ్ల కాలంలో ఆరుగురు న్యాయమూర్తులు మారిపోయారని కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టులో తాము అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్‌ చేస్తున్నామని విచారణకు ఎలాంటి అడ్డంకి రావడం లేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. ఈ కేసులో సీబీఐ తరపు వాదనలు వినిపించడానికి ఏఎస్​జీ రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

తదుపరి విచారణ నవంబర్‌ 11కు వాయిదా : ఏఎస్​జీ రాజును వెంటనే పిలిపించాలని, మధ్యాహ్నాం 2 గం.లకు విచారణ చేపడుతామని ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభమైంది. అయితే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం ముందు విచారణకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రాజు హాజరు కాలేదు. ఇలాంటి కేసుల విచారణలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రయల్‌ జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున వాటిని అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది. సీబీఐకి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 11 నుంచి ప్రారంభం అయ్యే వారంలో లిస్ట్‌ చేయాలని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.