ETV Bharat / state

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - ఈ నెల 19కి వాయిదా - Delhi Liquor Policy Case Updates

Supreme Court on MLC Kavitha Petition : ఈడీ జారీ చేరిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

SC on MLC Kavitha Petition
SC on MLC Kavitha Petition
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 1:29 PM IST

Updated : Mar 15, 2024, 2:37 PM IST

Supreme Court on MLC Kavitha Petition : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. అనంతరం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో తెలిపారు.

కవిత పిటిషన్​పై గత కొద్ది నెలలుగా సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కవిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ఇటీవలే ఫిబ్రవరి 28న ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే, కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్టు

ఈ కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన విషయం తెలిసిందే. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు గత విచారణలో జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

ED Notices to MLC Kavitha in Delhi Liquor Scam Case : మరోవైపు ఇటీవలే దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. జనవరి 16న విచారణకు రావాలని తెలిపింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించి విచారణకు హాజరుకాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్​లో ఉన్నందున హాజరుకాలేనని ఆమె ఆ లేఖలో వివరించింది. గతంలో కవితకు రెండు సార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం దిల్లీలో ఆమెను అధికారులు మూడు రోజులు విచారించారు.

ఎమ్మెల్సీ కవిత పిటిషన్​పై విచారణ.. మూడు వారాలకు వాయిదా

Last Updated : Mar 15, 2024, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.