ETV Bharat / state

'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి' - తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు - SC on Tirumala Laddu Adulteration

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Supreme Court on Tirumala Laddu Ghee Adulteration: తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూ వ్యవహారంపై సిట్‌ కొనసాగించాలా? లేదా? సహకారం ఇవ్వాలా అని ఎస్‌జీని కోరిన సుప్రీంకోర్టు, కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని పేర్కొంది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని కోరింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని, కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

SC ON TTD LADDU
SC ON TTD LADDU (ETV Bharat)

Supreme Court on Tirumala Laddu Ghee Adulteration: లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి (Subramanian Swamy), వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)తో పాటు రచయిత విక్రమ్ సంపత్, పలువురు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

అన్ని పిటిషన్లూ కలిపి ఒకేసారి విచారణ: ప్రసాదం కల్తీపై వాస్తవాలు తేల్చాలని సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ పేర్కొన్నారు. అదే విధంగా ప్రసాదం కల్తీపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్​లో కోరారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి సుప్రీంకోర్టు విచారిస్తోంది.

స్వతంత్ర విచారణ జరపాలా? లేదా?: తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై నేడు జరిగిన విచారణలో, లడ్డూ వ్యవహారంపై సిట్‌ కొనసాగించాలా? లేదా? సహకారం ఇవ్వాలా అని సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతాను (SOLICITOR GENERAL) కోరిన సుప్రీంకోర్టు, ఈ అంశం కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని పేర్కొంది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని కోరింది. అదే విధంగా సిట్‌ను కొనసాగించాలో? లేదో? చెప్పాలంది.

కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటి: ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని, ఇటువంటి అంశంలో రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారని అభిప్రాయపడింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఘాటుగా వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు, లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే దానికి ఆధారాలేంటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలు టీటీడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. జూన్‌ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనేది కోర్టుకు వివరాలను అందించారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని, ఒకవేళ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనేది నిజమే అయితే అది తీవ్ర అభ్యంతరకరమని సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి వివరించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

దూకుడు పెంచిన సిట్‌ - నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా - SIT Inquiry Adulteration Ghee Case

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.