ETV Bharat / state

విద్యుత్​ వాహన ఛార్జింగ్​ కేంద్రాలకు రూ.3 లక్షల వరకు రాయితీ - మొదటి 500 కేంద్రాలకేనట - త్వరపడండి - SUBSIDY ON ELECTRIC VEHICLES - SUBSIDY ON ELECTRIC VEHICLES

Government Guidelines on EV Charging Stations : ఏపీలోని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబోయే విద్యుత్ వాహన ఛార్జింగ్‌ కేంద్రాలకు రాయితీ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకైన ఖర్చులో 25 శాతం గరిష్ఠంగా రూ.3 లక్షల చొప్పున ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని ఐదేళ్లలో చెల్లిస్తుంది. అందుబాటులో ఉన్నచోట ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.

SUBSIDY ON ELECTRIC VEHICLES
EV CHARGING STATIONS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 12:00 PM IST

Electric Vehicle Charging Stations : ఆంధ్రప్రదేశ్​లో మొదట ఏర్పాటు చేసే 500 ప్రైవేట్ ఛార్జింగ్‌ కేంద్రాలకు మాత్రమే రాయితీలు వర్తింపజేయనుంది. ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను నోడల్‌ ఏజెన్సీగా నూతన పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) పర్యవేక్షించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లలో వినియోగించిన విద్యుత్‌పై నిర్వాహకుల నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున లీజుగా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుకు ప్రాధాన్యం : రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో ప్రాంతాలను గుర్తించింది. డిమాండ్‌ రెస్పాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆధారంగా స్మార్ట్‌ ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ఛార్జింగ్‌ పాయింట్‌ ఆపరేటర్లను నెడ్‌క్యాప్‌ ఎంపిక చేసేలా ప్రతిపాదించింది.

అవసరమైన ఇన్‌పుట్‌ విద్యుత్‌ను ఓపెన్‌ యాక్సెస్‌/ గ్రీన్‌ అమ్మోనియా జనరేటర్‌ నుంచి తీసుకునే వెసులుబాటును నిర్వాహకులకే కల్పించాలని నిర్దేశించింది. వివిధ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో మొదట ఏర్పాటు చేసే 150 ఛార్జింగ్‌ కేంద్రాలకే ప్రభుత్వం నిర్దేశించిన రాయితీలు అందుతాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

అందుబాటులోకి 33 ఎలక్ట్రిక్‌ సూపర్ లగ్జరీ బస్సులు - తొలి విడతలో కరీంనగర్‌ టూ జేబీఎస్ - Electric Buses Launch In Karimnagar

జాతీయ రహదారిపై 25 కి.మీ.లకు ఓ ఛార్జింగ్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట వచ్చిన 150 ప్రతిపాదనలకే రాయితీ వర్తిస్తుంది. అవసరమైన స్థలాన్ని నిర్వాహకులే సమకూర్చుకోవాలి. ప్రైవేటు, వాణిజ్య భవనాల్లో వందకు పైగా కార్ల పార్కింగ్‌కు అవకాశం (కనీసం 5వేల చ.మీ.స్థలం) ఉన్న వాటికి, అపార్టుమెంట్లు/సొసైటీలకు (500 ప్లాట్లు/ఇళ్లు) కలిపి రాయితీ ఇవ్వాలని భావిస్తోంది. మొదటి 50 ఛార్జింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలకే ఇది వర్తిస్తుంది.

ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలను ప్రత్యేక కేటగిరీ టారిఫ్‌ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా తక్కువ ధరకే విద్యుత్‌ అందించేలా ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం గంటసేపు ఛార్జింగ్‌కు సగటున రూ.25 వరకు ఖర్చవుతోందని, దీన్ని కనీసం రూ.15కు తగ్గించాలని ఛార్జింగ్‌ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

వచ్చే ఫిబ్రవరిలో భారత్​లోకి డావో ఈ-బైక్​లు

అందరి కళ్లూ వాటి పైనే.. జెట్​ స్పీడ్​లో EVల అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.