Student Suicide Attempt in Anurag University : క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్యలకు(Suicide) పాల్పడుతూ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలు, విషయాలకే మానసిక స్థైర్యం కోల్పోయి తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగులుస్తున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని, తల్లిదండ్రులు కోప్పడ్డారని, ప్రేమలో మోసపోయామని ఇలా చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటనే మేడ్చల్ జిల్లాలో జరిగింది.
'మమ్మల్ని శైలజా మేడం తప్ప ఎవరూ నమ్మలేదు - మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం'
Hyderabad Crime News : కాలేజీ డీన్ తనను తోటి విద్యార్థుల ముందు అవమానపరిచాడని మనస్తాపం చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా అనురాగ్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్లాపూర్‌కు చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం లో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
చెన్నై షాపింగ్ మాల్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
ఈ విద్యార్థి కళాశాలకు సరిగ్గా వెళ్లకపోవడంపై కాలేజీ డీన్ కేఎస్ రావు సదరు విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తోటి విద్యార్థుల ముందే తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపానికి లోనైన విద్యార్థి యూనివర్సిటీ భవనం రెండో అంతస్తుపై నుంచి కిందకు దూకాడు. ఇలా దూకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే తోటి విద్యార్థులు, అధ్యాపకులు ఆ యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Student Suicide Attempt in Medchal : ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. తన సోదరుడిని డీన్ కేఎస్ రావు అందరి విద్యార్థుల ముందు కొట్టడంతో ఆ అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని విద్యార్థి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు కళాశాల డీన్ మాత్రం తాను ఆ విద్యార్థికి కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చానని, విద్యార్థిపై చేయు చేసుకోలేదని చెప్పారు.
జనవరి నెలలో ఫోన్లో మాట్లాడుతూ ఐదో అంతస్తుపై నుంచి విద్యార్థిని దూకేసింది. అక్కడికక్కడే ఆ యువతి మరణించింది. ఐదో అంతస్తు నుంచి దూకుతూ మధ్యలో గోడను పట్టుకుని వేలాడింది. అయితే చేతి వేళ్లు పట్టుతప్పడంతో కిందకు జారిపోయి ప్రాణాలను విడిచిపెట్టింది. ఇలా అనేక చోట్ల విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి మరణమే శరణ్యంగా భావిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.