ETV Bharat / state

దుకాణాలు నిర్మించారు ఇవ్వడం మరిచారు -ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చిరు వ్యాపారుల ఇక్కట్లు

Street Vendors Problems In Nalgonda : వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వమే వీధి విక్రయదారుల సముదాయం నిర్మించి ఇస్తామంటే సంబురపడ్డారు. రహదారి విస్తరణలో ఉపాధి కోల్పోకుండా చూస్తామంటే ఆనందం వ్యక్తం చేశారు. చెప్పిన ప్రకారమే మోడల్‌ దకాణాలు నిర్మించారు. ఆరు నెలలు క్రితం నిర్మించిన ఈ షాపులు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Street Vendors In Nalgonda
Street Vendors
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 2:46 PM IST

దుకాణాలు నిర్మించారు ఇవ్వడం మరిచారు - వీధి విక్రయదారుల సముదాయం కొరతతో చిరు వ్యాపారుల ఇక్కట్లు

Street Vendors Problems In Nalgonda : నల్గొండ ఎన్జీ కళాశాల సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకుని చిరు వ్యాపారాలు చేస్తూ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పండ్లు, పూలు, కొబ్బరిబోండాలు, కుండలు ఇలా అనేక వ్యాపారాలు చేస్తూ బతుకుతున్న కుటుంబాలు ఎన్నో. ప్రధాన రహదారి విస్తరించడంతో వ్యాపారం చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో చిరువ్యాపారుల (Street Vendors) కోసం గత ప్రభుత్వం మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల సముదాయం నిర్మించింది. అక్కడ సూమారు 25 మోడల్‌ దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు ఇవి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వ్యాపారం చేస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిరు వ్యాపారుల్లో ఆశలు రేకెత్తించిన సీఎం రేవంత్ మాటలు - క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు

Street Vendors issue : ఎన్నికల ముందు నల్గొండలో పర్యటించిన కేటీఆర్‌ (KTR) ఆ సముదాయలను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ వల్ల పెండింగ్‌ పనులు ఉండటం వల్ల ఈ దుకాణాలు పంపిణీ నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మోడల్‌ దుకాణాలను వ్యాపారులకు అనుకూలంగా మార్చి ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అవి అందుబాటులో తేలేదని బాధితులు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మోడల్‌ దుకాణాలను తమకు అనుకూలంగా మార్చి అందుబాటులోకి తేవాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.

"అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ మోడల్​ దుకాణాలను వ్యాపారులకు అనుకూలంగా మార్చి ఇస్తామని చెప్పింది. వాటిని అందుబాటులో తీసుకురాలేదు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మోడల్​ దుకాణాలను మాకు ఇవ్వాలి. వేసవి కాలంలో పండ్లు పాడైపోతున్నాయి."-చిరు వ్యాపారులు

"ఆ రెండు లివర్‌లు ఎక్స్‌ట్రా అన్న మాటే, ఇక్కడి వరకు వచ్చింది"- కుమారి ఆంటీతో ముఖాముఖి

Street Vendors Problems : నల్గొండ ఎన్జీ కళాశాల సమీపంలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు సమీకృత మార్కెట్‌లో అవకాశం కల్పించామని మున్సిపల్‌ కమిషనర్‌ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు. సమీకృత మార్కెట్‌లో పనులు తుది దశకు వచ్చాయని పనులు పూర్తిగానే వారికి అక్కడ స్థలం కేటాయిస్తామని తెలిపారు. ఎండల తీవ్రత బాగా పెరిగిందని ప్రభుత్వం చోరవ తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.

"నల్గొండ ఎన్జీ కళాశాల సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకొని చిరు వ్యాపారాలు చేస్తున్న వారికోసం గత ప్రభుత్వం మున్సిపల్​ శాఖ ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల సముదాయం నిర్మించింది. అక్కడ 25 మోడల్​ దుకాణాలను ఏర్పాటు చేసింది. సమీకృత మార్కెట్​లో పనులు తుది దశకు వచ్చాయి. పనులు పూర్తి కాగానే అక్కడ స్థలం కేటాయిస్తాం."-సయ్యద్ ముసాబ్ అహ్మద్, నల్గొండ మున్సిపల్ కమిషనర్‌

Street Vendors: చిరువ్యాపారుల కోసమే షెడ్లు నిర్మించారు.. కానీ.. ఇచ్చింది మాత్రం..

రిషి సునాక్​కు 'కోహ్లీ బ్యాట్' గిఫ్ట్- మోదీ తరఫున దీపావళి విషెస్​ చెప్పిన జైశంకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.