ETV Bharat / state

గతి తప్పి తింటే అనారోగ్యమే! - తినడానికి ఓ పద్ధతుందంటున్నారు నిపుణులు - PROBLEMS BY EATING UNHEALTHY FOOD

ఒకేసారి అధిక మొత్తంలో తినడంతో అనర్థాలు - గతి తప్పుతూ అనేక అనారోగ్య సమస్యలు

Problems by Eating Unhealthy Food
Problems by Eating Unhealthy Food (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2025, 3:11 PM IST

Problems by Eating Unhealthy Food : కొందరికి గంట కొట్టినట్లు ఆకలవుతుంది. ఇది ఆరోగ్య లక్షణం. కొందరేమో గంటగంటకూ లాగించేస్తుంటారు. ఇది అనారోగ్య హేతువు. మారిన జీవనశైలి ఆహారపుటలవాట్లనూ మార్చేసింది. ఒకేసారి అధికమొత్తంలో తినేయడం, ఆకలి ఉన్నా, లేకున్నా ఏదో ఒకటి తింటూ ఉండడం అనర్థాన్ని తెచ్చిపెడతాయి. నిజానికి మనకు ఆకలైనపప్పుడు ఆహారం కావాల్సినప్పుడు మన శరీరం చెప్పేస్తుంది. దాన్ని అనుసరించి తీరాలి. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు చాలామంది మనకు నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు తింటున్నారు. అధిక బరువు నుంచి మధుమేహం వరకు అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.

ఇలా అదుపు తప్పుతూ :

  • మనం తినాలా? వద్దా? అనే విషయాన్ని శరీరం తెలియజేస్తుంది. ఆకలి అయినప్పుడు, ఆకలిగా లేనప్పుడు కూడా శరీరం కొన్ని సంకేతాలనిస్తుంది.
  • ఇలా జరగడానికి రెండు రకాల హార్మోన్లు కారణం. మొదటిది గ్రెలిన్‌ ఇది ఆకలిని సూచిస్తుంది. లెప్టిన్‌ కడుపు నిండిందని చెబుతుంది. దీని ప్రకారమే ఆహారం తీసుకోవాలి.
  • చాలామంది టీవీ, మొబైల్‌ చూస్తూ తింటుంటారు. దీంతో తినే ఆహారంపై అదుపు ఉండదు. కడుపు నిండిన భావన లేకపోవడం వల్ల అధికంగా తింటుంటారు. అలా చూస్తూ తినడం వల్ల ఎంత తింటున్నాం అన్నది తెలియకుండా తినేస్తాం.
  • ఇంకొందరు పని మధ్యలో ఏదో ఒక స్నాక్స్‌ను లాగించేస్తుంటారు.
  • దీంతో శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతుంది.

ఎక్కువగా తినడం వల్ల తక్షణం వచ్చే సమస్యలు :

  • సాధారణంగా మన ఖాళీ పొట్ట 75 మిల్లీలీటర్లు ఉంటుంది. ఇది 950 మిల్లీలీటర్ల పదార్థాలను ఇముడ్చుకోగలుగుతుంది. ఒకేసారి అంతకు మించి ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.
  • మీరు తిన్న తర్వాత కూడా ఆహ్లాదంగా ఉండాలి. కానీ అలసటగా ఉన్నారంటే మీరా రోజు ఎక్కువ తిన్నారని అర్థం చేసుకోవాలి.
  • ముఖ్యంగా హై ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరిగి, తిరిగి తగ్గుతాయి. దీనివల్ల అలసట, చికాకు కలుగుతాయి.
  • ఆహారానికి, నిద్రలేమికి సంబంధం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. నిద్ర తక్కువగా పోయేవారిలో 60 శాతం మందికి రాత్రిపూట స్నాక్స్‌ తినే అలవాటు ఉందని నిపుణులు చెబుతున్నారు.
  • జీర్ణాశయ సమస్యలైన అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్‌ వంటివాటికీ అధికంగా తినడమే ప్రధాన కారణమంటున్నారు వైద్యులు.

నటుడు మిథున్‌ చక్రవర్తి తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన ‘నేనో భూతంలా తిన్నాను దానికిలా శిక్ష అనుభవిస్తున్నాను’ అన్నారు. మీరూ మితంగా తినండి అని తన అభిమానులకు సూచించారు.

అధికాంగా తినడం వల్ల శాశ్వత అనర్థాలు :

  • మీరు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారన్నది చాలా ముఖ్యమైన విషయం. మిగిలిన క్యాలరీలన్నీ శరీరంలో కొవ్వుగా పోగుపడతాయి. అది అధిక బరువుకు కారణమవుతుంది.
  • అధిక బరువుతో వాపు ప్రక్రియ ముప్పు ఎక్కువవుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
  • అవసరం లేకున్నా తినే వారిలో గ్రెనిన్, లెప్టిన్‌ హార్మోన్లు మందగొడిగా మారతాయి.
  • మనకు ఇష్టమైన ఆహారాన్ని తింటున్నప్పుడు డొపమైన్‌ విడుదలవుతుంది. ఇది మనకు మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ శరీరంపై మాత్రం తీవ్ర దుష్ప్రభావాలను చూపుతుంది.
  • అధికంగా తింటే శరీరంలోని చక్కెర స్థాయులపై ప్రభావం పడుతుంది. దీంతో టైప్‌2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది.
  • జీర్ణం చేసే ఎంజైమ్‌లు ఆహారం వాసనతో పని చేస్తాయి. ఆకలి కాకున్నా తినడం వల్ల మెదడు జీర్ణ ప్రక్రియలను సూచించడం మందగిస్తుంది. ఇది భవిష్యత్తులో జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఇలా చేస్తే రోగాలు దూరం :

  • ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. బాగుంది కదా అని ఎక్కువగా తినడం, తొందరగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు.
  • భోజనంలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల తక్కువ తింటాం. జీర్ణక్రియ మెరుగవుతుంది.
  • ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారు కూడా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఆహారం తినే సమయంలో కొంతమంది కూల్‌డ్రింక్‌లు తీసుకుంటారు. దీనివల్ల తినే మోతాదు కూడా పెరుగుతుంది. తక్షణం ఈ అలవాట్లను మానుకోవాలని నిపుణులు అంటున్నారు.
  • భోజనాన్ని సలాడ్‌లు, కూరగాయలతో ప్రారంభిస్తే తినే మోతాదు కూడా తగ్గుతుంది.
  • భోజనంలో పావు వంతు పిండి పదార్థాలు, పావు వంతు ప్రొటీన్లు, మిగతా సగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే పోషకాలన్నీ శరీరానికి సమతులంగా అందుతాయి.

బయట ఆహారం తింటున్నారా? - ఎక్కడ పడితే అక్కడ తింటే ఆరోగ్య సమస్యలు!

జాతర్లలో కనిపించిందల్లా కొనేసి తింటున్నారా? - అది ఆరోగ్యానికి హానికరమట

బలహీనమవుతున్న బాల్యం! - బాసటగా నిలుస్తున్న అంగన్​వాడీ కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.