ETV Bharat / state

ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారం - మాజీ మంత్రి కేటీఆర్​పై కేసుకు రంగం సిద్ధం! - CASE ON KTR

కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి - ఏసీబీకి పంపించాలని సీఎస్​ను ఆదేశించిన మంత్రివర్గం - ఇవాళ కేటీఆర్, అర్వింద్‌ కుమార్‌పై కేసు నమోదుకు అవకాశం

CONGRESS ON KTR CASE
Telangana Govt on KTR in E Formula Race (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2024, 7:10 AM IST

Telangana Govt on KTR in E Formula Race : ఫార్ములా - ఈ కారు కేసుపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సుమారు 5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఫార్ములా-ఈ కార్ రేసు అంశంపై చర్చించారు. రేసు సమయంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సీఎస్ శాంతికుమారి కేబినెట్‌కు తెలిపారు. మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున, అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి కోసం పురపాలక శాఖ లేఖ రాసింది. న్యాయ నిపుణుల సలహా తీసుకొని గవర్నర్ అనుమతులు ఇచ్చారు.

దర్యాప్తు ప్రక్రియ, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కేబినెట్‌లో చర్చించారు. గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే ఏసీబీకి పంపించేందుకు సీఎస్‌కు మంత్రివర్గం అనుమతినిచ్చింది. ఫార్ములా-ఈ కారు రేసు అంశంలో ఏం జరిగిందో సీఎం, అధికారులు కేబినెట్‌ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో జరిగిన దోపిడీపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందన్నారు. అర్వింద్ కుమార్‌పై కేసు నమోదు కోసం సీఎస్ ఇప్పటికే అనుమతినిచ్చారని, కేటీఆర్​పై మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున చట్ట ప్రకారం గవర్నర్ అనుమతి కోరినట్లు మంత్రి తెలిపారు.

ఏజెన్సీలపై కూడా కేసు నమోదయ్యే అవకాశం : కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని, చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి పొంగులేటి సోమవారం వ్యాఖ్యానించారు. ఏజెన్సీలపై కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఎవరు ఇచ్చారు? నిధులు ఎక్కడికి చేరాయి? ఎవరెవరి చేతులు మారాయో దర్యాప్తులో తేలుతుందని మంత్రి అన్నారు. ఈ అంశంలో భారీ అవినీతి జరిగినట్లు మంత్రి పొంగులేటి అంచనా వేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, అవినీతిని ప్రజల ముందుంచడమే తమ ఉద్దేశమని చెప్పారు.

బాంబు తుస్సుమనేదే అయితే దిల్లీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డి ఎద్దేవా చేశారు. జైలుకెళ్లి వచ్చిన తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, పాదయాత్ర చేస్తారా? మోకాళ్ల యాత్ర చేస్తారో వారిష్టమని వ్యాఖ్యానించారు. గవర్నర్ అనుమతి లేఖ సీఎస్ నుంచి అందగానే ఇవాళ కేటీఆర్, అర్వింద్ కుమార్, తదితరులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సోదాలు, నోటీసులు తదితర దర్యాప్తు ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కేటీఆర్ అరెస్టుపై నేనేమీ చెప్పలేను - చట్టం తన పని తాను చేస్తుంది : మంత్రి పొంగులేటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.