ETV Bharat / state

అల్లు అర్జున్​పై కేసు వెనక్కి తీసుకుంటాను : శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ - SRI TEJ HEALTH BULLETIN UPDATE

కేసు వెనక్కి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ వెల్లడి - శ్రీతేజ్‌ గురించి అల్లు అర్జున్‌ రోజూ తెలుసుకుంటున్నారని చెప్పిన భాస్కర్‌

KIMS HOSPITAL
శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

Updated : 9 hours ago

Sri Tej Father Bhaskar About Her Son Health Condition : సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్​ తండ్రి భాస్కర్‌, తొక్కిసలాటపై పెట్టిన కేసు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇవాళ ఆయన కిమ్స్​ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అర్జున్‌ ప్రతిరోజు తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శ్రీతేజ్‌ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూస్తున్నాడని అన్నారు. అయితే ఇంకా తమను గుర్తించట్లేదని వెల్లడించారు.

పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్​ వారు రూ.50 లక్షలు, ప్రతీక్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిచారని అన్నారు. పుష్ప-2 నటుడు అల్లు అర్జున్ రూ.10 లక్షలు ట్రీట్​మెంట్​ కొరకు అందించినట్లు భాస్కర్ తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ, అల్లు అర్జున్ నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని పేర్కొన్నారు. అవసరమైతే నటుడు అల్లు అర్జున్​పై పెట్టిన కేసు వెనక్కి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు శ్రీతేజ్​ తండ్రి భాస్కర్​ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కిమ్స్​ ఆసుపత్రి వైద్యులు బాలుడు శ్రీతేజ్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఆ రోజు అసలు ఏమైందంటే : తొక్కిసలాట ఘటన జరిగిన రోజు అసలు ఏమైంది? అని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు భాస్కర్​ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తన కుమారుడు శ్రీ తేజ్​కు వైద్యులు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని, కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వారు చెబుతున్నారని అన్నారు. రెండో రోజు నుంచే తనకు మీడియా మద్దతు లభించినట్లు చెప్పారు. అల్లు అర్జున్ నుంచి సానుకూల స్పందన రావడంతో కేసు వాపసు తీసుకుంటానని చెప్పినట్లు పేర్కొన్నారు.

వైద్యం కోసం తమను వైద్యులు ఇప్పటి వరకైతే డబ్బులు అడగలేదని వెల్లడించారు. మేము చూసుకుంటాం మాకు ప్రభుత్వం నుంచి గైడ్​లైన్స్​ వచ్చాయని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం బాలుడు శ్రీతేజ్​ను ఐసీయూ(ఇంటెన్సివ్​ కేర్​ యూనిట్​) నుంచి ప్రత్యేక రూమ్​కు​ షిఫ్ట్‌ చేసి వెంటిలేటర్‌(ఆక్సిజన్​) సపోర్టు తీసేశారని తెలిపారు. డైరెక్టర్​ సుకుమార్​ ఫ్యామిలీ సైతం రెండు సార్లు ఆసుపత్రికి వచ్చారన్నారు.

"ముందుగా థియేటర్​లోకి నా భార్యా పిల్లలు వెళ్లారు. జనాలు చాలా ఎక్కువగా ఉండడంతో నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయినట్లు తెలిసింది. పోలీసులు నాకు ఫోన్​ చేసి చెప్పడంతో నేను అక్కడికి వెళ్లి చూసే సరికి ఆమె నా భార్య కావడంతో షాక్​కు గురయ్యాను. తన కొడుకు శ్రీతేజ్​ కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిసి మరింత కుంగుబాటుకు గురయ్యాను"- భాస్కర్​, శ్రీతేజ్ తండ్రి

'అల్లు అర్జున్ చెప్పింది అబద్ధం - శ్రీతేజ్​కు ఇచ్చింది రూ.10లక్షలే, 25లక్షలు కాదు'

శ్రీతేజ్​కు రూ.50లక్షల చెక్కు అందించిన మైత్రీ మూవీస్ - అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన కోమటిరెడ్డి

Last Updated : 9 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.