Sri Sathya Sai District Vote Issues : గ్రామంలో రాత్రి నిద్రపోతేనే ఓటర్లుగా గుర్తిస్తాం అని అధికారులు అంటున్నారు. పెళ్లి కాని యువత పేర్లనే ఓటర్లుగా నమోదు చేస్తాం. ఇళ్లు వాకిలీ ఇక్కడే ఉన్నా, పింఛను తీసుకుంటున్నా మాకు సంబంధం లేదు. ఇవీ ఓటు హక్కు కోసం ఆ గ్రామస్థులకు అధికారులు విధించిన షరతులు. ఇలాంటి నిబంధనలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి. దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీ సీఎం జగన్(AP CM Jagan) పాలనలోనే కనిపిస్తాయి, వినిపిస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ముంపు గ్రామాలైన సీసీరేవు, మర్రిమేకలపల్లి గ్రామస్థులకు ఓటు హక్కు ఇవ్వడానికి అధికారులు నరకం చూపిస్తున్నారు.
Votes Removed For Not Sleeping in Village : ఉమ్మడి అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్వాసుతుల్ని ప్రభుత్వ యంత్రాంగం మొదటి నుంచి ఇబ్బందులు పెడుతోంది. ఓటర్ లిస్టులో పేరు ఎందుకు తీసేశారు అని ఫోన్‌లో ప్రశ్నించిన ముంపు బాధితుడికి ఎమ్మార్వో (MRO) డొంకతిరుగుడు సమాధానం చెబుతున్నారు. కడప జిల్లా అవసరాల కోసం చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 2021లో అయిదు టీఎంసీల నుంచి పది టీఎంసీలకు పెంచారు. ఫలితంగా సీసీరేవు పంచాయతీలోని చిన్న చిగుళ్ల రేవు, మర్రిమేకలపల్లి ముంపునకు గురయ్యాయి. నీటి నిల్వ చేయడానికి పోలీసులతో బెదిరించి అప్పటికప్పుడు ఇళ్లు ఖాళీ చేయించారు. ఆ తర్వాత ఇచ్చిన చాలీచాలని పరిహారంతో ఎన్నో కష్టాలకు ఓర్చి గ్రామస్థులు ఇళ్లు నిర్మించుకున్నారు.
హైకోర్టులో ఏపీ సర్కారు అబద్ధాలు - క్షమాపణలు కోరిన ఏజీ శ్రీరామ్
Authorities removed For villager votes : అప్పుడు గూడు కోసం పోరాడితే ఇప్పుడు ఓటు హక్కు కోసం ఉద్యమించాల్సి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ముప్పతిప్పలు పెడుతున్నారు. వీరి సమస్యపై 'నీటిలో ముంచారు-ఓటు హక్కు లేకుండా చేస్తున్నారంటూ' ఈటీవీ(ETV) వరుస కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన రాష్ట్ర స్థాయి అధికారులు కొత్తగా నిర్మించుకున్న గ్రామానికి గుర్తింపునిచ్చి వెంటనే ఓట్లు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. సీసీరేవు, మర్రిమేకలపల్లిలో సర్వే చేసిన అధికారులు 1667 మంది ఓటర్లు ఉన్నారని తేల్చారు. గ్రామంలో రాత్రి నిద్రపోవడం లేదని 600 మంది ఓట్లు తొలగించారు. ఇదెక్కడి అన్యాయమంటూ శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు తమ సమస్యను గ్రామస్థులు వివరించారు. తమ శాశ్వత చిరునామా ఇదేనని ఎంత మొత్తుకున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదని వాపోతున్నారు.
తొలగించిన ఓట్లు ఎక్కువగా మర్రిమేకల పల్లికి చెందినవే ఉన్నాయి. ఈ గ్రామంలో 80 శాతం మంది టీడీపీ(TDP)సానుభూతిపరులని భావించిన వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి చేసి ఓట్లు తొలగించారనే ఆరోపణలున్నాయి. ఓటరు జాబితాలో తమ పేర్లు వెంటనే చేర్చకపోతే అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సీసీరేవు, మర్రిమేకల పల్లి గ్రామస్థులు సిద్ధమవుతున్నారు.
పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం - ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెడుతున్న ఏపీ సీఎం