ETV Bharat / state

YUVA : ప్రకృతి పరవశించేలా గానం- సాగులో కన్నవాళ్లకు సాయం - ఈ జానపద గానకోకిల గాథ మీరూ తెలుసుకోవాల్సిందే - Special Story On Folk Singer

Special Story On Folk Singer Jhansi : చరిత్రలో ఏ ఉద్యమాన్ని తీసుకున్నా పాటలదే ప్రధాన పాత్ర. ఉద్యమాలకు ఊపిరి పోయడంలో అవి ముఖ్య భూమిక పోషించాయి. ప్రజలను చైతన్యపరిచే అలాంటి పాటలను అవపోసన పట్టిందా యువతి. పాట ఏదైనా పల్లవి ఎంత కఠినమైనా ఇట్టే పాడేస్తూ సంగీత ప్రియుల మన్ననలు పొందుతోంది. పాటలతోపాటు, విద్య, వ్యవసాయం మూడింటినీ త్రికరణ శుద్ధితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మరి, ఆ గానకోకిల గాథ గురించి మనమూ తెలుసుకుందామా

Special Story On Folk Singer Jhansi
Special Story On Folk Singer Jhansi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 12:55 PM IST

Updated : Aug 14, 2024, 1:07 PM IST

Special Story On Folk Singer Jhansi : వినసొంపైన గానంతో ప్రకృతి సైతం పరవశించేలా పాట పాడుతున్న ఈ యువతికి చిన్ననాటి నుంచే పాటలు పాడటమంటే చాలా ఇష్టం. ఉద్యమ గీతాలే ఊపిరిగా జానపద గేయాలే జనాలను ఆకర్షిస్తాయనే నమ్మకంతో పల్లె పాటలు, ఉద్యమ గీతాలపై ప్రేమను పెంచుకుంది. అంతేకాదు వ్యవసాయం, చదువులోనూ తనదైన ప్రతిభ చాటుతూ సంగీతప్రియుల మన్ననలు పొందుతోంది.

మగవారికి ఏమాత్రం తీసిపోకుండా ట్రాక్టర్‌తో వరిమడిని చదును చేస్తున్న ఈ యువతి పేరు ఝాన్సీ. సూర్యాపేట జిల్లాలోని కోమటికుంట గ్రామానికి చెందిన వ్యవసాయం కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు సైదులు, హేమలత. వీరికి నలుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలే వారిలో ఝాన్సీ చిన్న కుమార్తె. వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నారు.

తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా : చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కష్టాన్ని చూసిన ఝాన్సీ వారికి చేదోడు వాదోడుగా నిలవాలనుకుంది. ప్రతిరోజు పొలానికి వెళ్తూ పనుల్లో సాయం చేస్తోంది. మందుల పిచికారి నుంచి మొదలుకొని ట్రాక్టర్‌తో దున్నడం వంటి పనులతో అమ్మనాన్నలకు ఆసరాగా నిలుస్తోంది.

పాటలపై మక్కువ పెంచుకుని : అక్షరాలు దిద్దుతున్నప్పటి నుంచే పాటలు పాడటం అంటే ఝాన్సీకి మహాఇష్టం. అలా మూడో తరగతి నుంచే పాటలు పాడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. పాఠశాల, కళాశాల జరిగే కార్యక్రమాల్లో వినసొంపైన గానంతో సంగీత ప్రియులను మెప్పించి బహుమతులు అందుకుంది. జానపదాలతో పాటు ప్రజలను చైతన్యపరిచే పాటలు పాడటమే తనకిష్టమని చెబుతోంది ఝాన్సీ.

చదవులోనూ ప్రతిభ చూపుతున్న ఝాన్సీ : పాటలు, వ్యవసాయం పనుల్లో పడి చదువును ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు ఝాన్సీ. డిగ్రీలో 10/10 ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీజీ చేస్తోంది. భవిష్యత్తులో పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమౌతున్నట్లు చెబుతోంది. ఆడపిల్లలు చదువుతో పాటు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచిస్తోందీ లేడీ సింగర్‌.

పాడిన పాటలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా మంచి ఆదరణ వస్తుందని చెబుతోంది ఝాన్సీ. జిల్లాల విశిష్టతను తెలిపే పాటతో విశేషలంగా ఆకట్టుకుంటోంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం తానే స్వయంగా పాటను రాశానంటోందీ గాయనీ.

సుద్దాల అశోక్​తేజ నుంచి ప్రశంసలు : బాలకార్మికులు, రైతులు, బతుకమ్మ నేపథ్యమున్న పాటలు పాడుతూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది ఝాన్నీ. ఒకానొక సందర్భంలో సుద్ధాల అశోక్‌తేజ అభినందనలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని చెబుతోంది. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో వ్యవసాయ పనులు నేర్పించినట్లు ఈ యువతి తల్లిదండ్రులు చెబుతున్నారు. తమకు చేదోడువాదోడుగా ఉంటూ చదువు, పాటల్లో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు.

వ్యవసాయ పనుల్లో కుటుంబానికి అండగా ఉంటూనే పాటల్లో పరిణతి చెందుతోంది ఝాన్సీ. భవిష్యత్తులో పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యమని అంటోంది. ఎంతటి స్థాయికి చేరినా...అభిరుచులను మాత్రం వీడనని చెబుతోందీ ఫోక్‌ సింగర్‌.

YUVA : సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు - యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్న నల్గొండ యువ రైతు - Organic Farming in Nalgonda

YUVA : తెలుగు సినిమా రంగంలో రాణిస్తున్న యువత - ఉద్యోగాలను వదిలేసి సినిమా వైపు ప్రయాణం - Success Story of Young Film Makers

Last Updated : Aug 14, 2024, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.